గంట గంటకి పెరుగుతున్న వ్యూస్

Friday,December 09,2016 - 11:45 by Z_CLU

నచ్చితేనే ఆయన చేస్తాడు… నచ్చితేనే వీళ్ళు చూస్తారు. రెండింటికి బాగా సింక్ అయింది కాబట్టే మెగాస్టార్ కి ఆ లెవెల్ లో క్రేజ్. తొమ్మిదేళ్ళ లాంగ్ గ్యాప్ తరవాత తెరకెక్కిన ‘ఖైదీ నం 150’ చిరు పర్ఫామెన్స్ లోను, ఇటు ఫ్యాన్స్ టేస్ట్ లోను క్వాలిటీ తగ్గలేదని ప్రూఫ్ చేసింది.

మోస్ట్ అవేటింగ్ మెగా ఎంటర్ టైనర్  ‘ఖైదీ నం 150’ టీజర్ రిలీజయి గడిచింది కొన్ని గంటలే అయినా, సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. టీజర్ రిలీజయిన కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ దాటేశాయి. గంట గంటకి పెరుగుతున్న యూ ట్యూబ్ వ్యూస్ చూస్తుంటే ఈ సినిమా ఫ్యాన్స్ పై చూపిన ఇంపాక్ట్ నంబర్స్ లో తెలుస్తుంది.

V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన మెగాస్టార్ ఖైదీ నం 150, సంక్రాంతి బరిలో దూకడానికి రెడీ అవుతుంది. జస్ట్ మెగాస్టార్ మ్యానరిజాన్ని ఎలివేట్ చేస్తున్న టీజర్, చిరు ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ సీన్లలో, డ్యాన్స్ లో ఇంకా ఎంతలా ఇరగదీశాడోనన్న క్యూరాసిటీ రేజ్ చేసింది.