చిరు ఆడియో ఫంక్షన్ కు పవన్..?

Wednesday,December 14,2016 - 03:05 by Z_CLU

మహా అయితే ఇంకా సరిగ్గా నెల. ఈ లోపు బాస్ ఆన్ స్క్రీన్ ఉంటాడు. ఈ లోపు ప్రమోషన్ ప్లాన్స్ ని డిజైన్ చేసుకునే పనిలో పడిన సినిమా యూనిట్, ఆడియో ఈవెంట్ ని విజయవాడలో క్రిస్ మస్ రోజున గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసే ఆలోచనలో ఉందని టాక్.

ఇంతకీ ఈ ఫంక్షన్ కి పవర్ స్టార్ వస్తున్నాడా…? ఇదే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ లో మిలియన్ డాలర్ క్వశ్చన్. ఎప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఈవెంట్ లో స్టేజ్ పై కనిపించిన ఈ మెగా కాంబో, మళ్ళీ మెగా 150 లోను సర్ ప్రైజ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఈ మధ్య మెగా కాంపౌండ్ లో ప్రతి హీరో వారి వారి వెంచర్స్ తో బిజీ బిజీగా ఉన్నారు. దాంతో మ్యాగ్జిమం ఆడియో ఫంక్షన్ ని అవాయిడ్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్, అన్నయ్య సినిమాకేం చేయబోతున్నాడు..? టైం తీసుకుని మరీ అటెండ్ అవుతాడా..? లేకపోతే చిన్న వీడియో ఏదైనా పంపి సైడ్ అయిపోతాడా అనేది చూడాలి.