హీరోలు - ప్రతిష్టాత్మక చిత్రాలు

Wednesday,June 21,2017 - 07:30 by Z_CLU

టాలీవుడ్ స్టార్స్ చాలామంది ఇప్పుడు ఒకే సీజన్ లో తమ కెరీర్ లో ప్రతిష్టాత్మక సినిమాలకు దగ్గరగా వచ్చారు. కొందరు తారలు ఇప్పటికే తమ కెరీర్ లో మైల్ స్టోన్ మూవీస్ పూర్తిచేయగా.. మరికొందరు ఇప్పుడిప్పుడే ప్లాన్ చేసుకుంటున్నారు.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో సెట్స్ పై ఉన్నాడు. ఈ సినిమాతో తన కరియర్ లో సక్సెస్ ఫుల్ గా 25 సినిమాల ల్యాండ్ మార్క్ ని క్రాస్ చేయబోతున్నాడు.

రీసెంట్ గా గురు సినిమాతో తనలోని డిఫెరెంట్ యాగిల్ ని ప్రెంజెంట్ చేసిన వెంకీ, ప్రస్తుతం తన కెరీర్ లోనే వెరీవెరీ స్పెషల్ స్టేజ్ కు దగ్గరయ్యాడు. అదే 75వ సినిమా. ఇప్పటితరం హీరోలకు భవిష్యత్తులో ఇన్నేసి సినిమాలు చేయడం సాధ్యం కాదేమో. అందుకే తన ప్రతిష్టాత్మక 75వ సినిమా కోసం ఇప్పట్నుంచే కథలు వినడం ప్రారంభించాడు వెంకటేష్. విక్టరీ వెంకటేష్ సినిమాలంటేనే చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక 75వ సినిమా అంటే అదింకెంత ప్రత్యేకంగా ఉంటుందో కొత్తగా చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం కొరటాల శివతో అల్టిమేట్ పొలిటికల్ థ్రిల్లర్ తో సెట్స్ పై ఉన్న మహేష్ బాబు, తన మైల్  స్టోన్ మూవీని వంశీ పైడిపల్లి తో ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ బిగిన్ అయిన ఈ సినిమా, మహేష్ బాబు కరియర్ లోనే స్పెషల్ మూవీగా నిలవడం ఖాయం. ఎందుకంటే కథ ఎంతో కొత్తగా ఉంటే కానీ వంశీ పైడిపల్లి టేకప్ చేయడు. ఆ కొత్తదనం తనకు నచ్చితే కానీ దర్శకుడికి ఛాన్స్ ఇవ్వడు మహేష్. సో.. మహేష్ 25వ మూవీ కొత్తకొత్తగా ఉండబోతోందన్నమాట.

టాలీవుడ్ బ్రాండెడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా  DJ మూవీతో తన మైల్ స్టోన్ మూవీని రీచ్ అయ్యాడు. అల్లు అర్జున్ హీరోగా అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన డీజే సినిమా, నిర్మాతగా దిల్ రాజుకు 25వ చిత్రం. ఈ సినిమాతో తన బ్రాండ్ వాల్యూను మరింత పెంచుకోబోతున్నాడు దిల్ రాజు.

తేజ డైరెక్షన్ లో వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అయింది కాజల్. ఇప్పుడు తన కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన 50వ సినిమాను కూడా తేజ దర్శకత్వంలోనే చేయడం నిజంగా గొప్పవిషయం. అవును.. రానా హీరోగా తేజ దర్శకత్వంలో చేస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమా.. కాజల్ కు 50వ చిత్రం.

మెగాస్టార్ చిరంజీవి అయితే ఇప్పటికే తన మైలు స్టోన్ మూవీని ఫినిష్ చేశాడు. వినాయక్ దర్శకత్వంలో చిరు చేసిన ఖైదీ నంబర్ 150 సినిమా.. మెగాస్టార్ కు 150వ చిత్రం. అంతేకాదు.. హీరోగా చిరంజీవికి రీఎంట్రీ మూవీ కూడా ఇదే కావడం విశేషం. దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత తన 150వ సినిమా పూర్తిచేశారు చిరు. తన ప్రతిష్టాత్మక మైల్ స్టోన్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్.

 

చిరంజీవితో పాటు బాలయ్య కూడా ఒకేసారి తన కెరీర్ లో ఓ మైలురాయిని అధిగమించారు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా బాలయ్యకు వందో సినిమా. ఈ సినిమాపై భారీ అంచనాలుండేవి. ఆ అంచనాలకు తగ్గట్టే అద్భుతమైన కథను ఎంచుకున్న బాలకృష్ణ.. అదే స్థాయిలో అద్భుత విజయాన్ని కూడా అందుకున్నారు.

యంగ్ టైగర్ NTR కూడా తన కెరీర్ లో ఓ మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటికే 25 సినిమాలు కంప్లీట్ చేశాడు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో చిత్రం ఎన్టీఆర్ కు 25వ సినిమా. ఈ సినిమా స్టోరీలైన్, ఎన్టీఆర్ గెటప్ చూస్తే ఎన్టీఆర్ కు 25వ సినిమాగా ఇది పర్ ఫెక్ట్ మూవీ అనిపిస్తుంది.