Vijay Deverakonda LIGER - మైక్ టైసన్ డబ్బింగ్

Sunday,April 03,2022 - 07:21 by Z_CLU

Mike Tyson Completes Dubbing For Vijay Deverakonda’s LIGER

విజయ్ దేవరకొండతో భారీ అంచనాలతో రూపొందిన చిత్రం `లైగర్`. ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ దర్శకత్వం వహించిన ఈ లైగర్ సినిమాతో ప్రపంచ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలోకి అడుగుపెట్టాడు.

యుఎస్ఎ లో విజయ్ దేవరకొండతో పాటు మైక్ టైసన్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. తాజాగా మైక్ టైసన్ ఈ చిత్రానికి డబ్బింగ్ పూర్తి చేశారు. “నా పట్ల దయ చూపినందుకు చాలా ధన్యవాదాలు. నేను చాలా కృతజ్ఞుడను, ”అని మైక్ టైసన్ ఒక వీడియోలో తెలిపారు.

మైక్ టైసన్ ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్రను పోషించాడు. అతనిపై చిత్రీకరించిన సన్నివేశాలు మెయిన్ హైలెట్. విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ కలిసి తెరపై చూడటం అభిమానులకు పండగే.

పూరీ కనెక్ట్స్ తో కలిసి, ఈ చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

vijay deverakonda liger movie

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics