Middle Class Melodies - ట్రయిలర్ రివ్యూ

Tuesday,November 10,2020 - 10:51 by Z_CLU

దొరసాని తో హీరోగా పరిచయమైన ఆనంద్ దేవరకొండ.. తన రెండో ప్రయత్నంగా మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

ట్రయిలర్ చూస్తుంటే బొంబాయి చట్నీ కాన్సెప్ట్ తో సినిమాను స్టార్ట్ చేసి, లవ్-ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిక్స్ చేసినట్టు కనిపిస్తోంది. గుంటూరు బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా వస్తోందనే విషయం… గుంటూరు సాంగ్ తోనే తెలిసిపోయింది. ఇక ట్రయిలర్ లో ఓ చిన్న పల్లెటూరిలో ఉండే హీరో, గుంటూరు టౌన్ లో హోటల్ పెడతాడు. అతడు ఆ బిజినెస్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనే ఎలిమెంట్స్ ను చూపించారు.

మిడిల్ క్లాస్ కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ తన లుక్స్, డ్రెస్సింగ్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ వర్ష బొల్లమ్మ కు మంచి రోల్ దొరికినట్టు కనిపిస్తోంది. ట్రయిలర్ చూస్తుంటే, సినిమాలో మంచి ఫన్ ఉండేలా ఉంది.

వినోద్ అనంతోజు డైరక్ట్ చేసిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి.ఆనందప్రసాద్ నిర్మించారు. ఈనెల 20న ఓటీటీలో రిలీజ్ కాబోతోంది Middle Class Melodies.