ఫిబ్రవరి 14న 'మిడిల్ క్లాస్ మేలోడీస్' ప్రీమియర్ !

Wednesday,February 10,2021 - 06:28 by Z_CLU

OTT లో సూపర్ హిట్టయిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఇప్పుడు టివీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. ఆనంద్ దేవరకొండ , వర్ష బొల్లమ్మ జంటగా వినోద్ అనంతోజు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 14( ఆదివారం )న 12 గంటలకు ‘జీ తెలుగు’లో వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అవ్వనుంది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా OTT లో ఆడియన్స్ ని ఆకట్టుకొని పాజిటీవ్ రివ్యూస్ అందుకుంది. ముఖ్యంగా సినిమాలో కొండలరావు క్యారెక్టర్ బాగా క్లిక్ అయింది. ఆ పాత్రలో గోపరాజు రమణ నటన సినిమాకు హైలైట్ గా నిలిచింది.

హీరో -హీరోయిన్ క్యారెక్టరైజేషణ్స్ , హోటల్ ఇన్వెస్ట్ మెంట్ పాయింట్, స్క్రీన్ ప్లే, సాంగ్స్ , డైలాగ్స్ , కామెడీ ఇలా అన్ని చక్కగా కుదిరిన ఈ సినిమా ఈ ఆదివారం జీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని అలరించడం ఖాయం. మరి ఈ ఆదివారం ఈ సినిమాను చూడటం miss అవ్వకండి.

మిడిల్ క్లాస్ మేలోడీస్ World Premiere On Feb 14th