ఈ సినిమా కూడా డైరక్ట్ ఓటీటీ రిలీజ్?

Monday,July 13,2020 - 01:42 by Z_CLU

కరోనా కారణంగా సినిమా హాల్స్ తెరవడానికి ఇంకా కొన్ని నెలలు పట్టనుండటంతో ఇప్పుడు చిన్న సినిమా నిర్మాతలు ప్రత్యామ్నాయంగా OTT వైపు చూస్తున్నారు. ఇందులో భాగంగా 47 డేస్, బెలూన్ లాంటి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేసి నేరుగా ఓటీటీలో రిలీజయ్యాయి.

ఇపుడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమా కూడా ఒకటి డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు రెడీ అవుతున్నట్టు టాక్.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వినోద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు మిడిల్ క్లాస్ మెలొడీస్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు. చాన్నాళ్ల కిందటే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను   ఉన్నపళంగా ప్రమోషన్ స్టార్ట్ చేయడానికి కారణం OTT లో రిలీజ్ చేయడానికే అని సమాచారం.

లాక్ డౌన్ కంటే ముందే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రెడీ టూ రిలీజ్ స్టేజ్ లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారట మేకర్స్. ఈ విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది.