Super Hit - మిడిల్ క్లాస్ మెలొడీస్

Thursday,November 26,2020 - 11:40 by Z_CLU

Middle Class Melodies విడుదలైన మొదటి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది మూవీ. ఆ తర్వాత రోజురోజుకు మౌత్ టాక్ పెరిగి ప్రస్తుతం సూపర్ హిట్ అనిపించుకుంటోంది. సోషల్
మీడియాలో ఎక్కడ చూసినా ఈ సినిమాపై డిస్కషన్ కనిపిస్తోంది.

ఇన్నాళ్లూ ఎక్క‌డో ఉన్న మ‌ళ‌యాలంలో ఏదైనా కాన్సెప్ట్ ఓరియెటెండ్ సినిమా బాగుంటే అంతా ఆ సినిమా చూసి, దానీ రీమేక్ చేసి తెలుగులో కూడా తీసి ముచ్చ‌ట ప‌డేవాళ్లం. అయితే డైరెక్ట్ గా తెలుగులోనే మిడిల్ క్లాస్ మెలొడీస్ లాంటి ఇలాంటి న్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా రావడం, దానికి
సూపర్ హిట్ టాక్ రావడం గ్రేట్.

మిడిల్ క్లాస్ మెలొడీస్ సక్సెస్ తో టాలీవుడ్ లో రాబోయే రోజుల్లో మరిన్ని కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. తెలుగు నేటివిటీకి మరింత ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంది.

ఇక సినిమా విషయానికొస్తే.. కేవలం హీరోహీరోయిన్ల క్యారెక్టర్ తోనే కాకుండా.. దాదాపు అన్ని పాత్రలతో ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం ఈ సినిమా ప్రత్యేకత. కొందరికి హీరోయిన్ పాత్ర నచ్చితే, చాలామందికి హీరో తండ్రి క్యారెక్టర్ నచ్చింది. మరికొంతమందికి హీరో స్నేహితుడు, ఆ స్నేహితుడి లవర్ పాత్రలు నచ్చాయి.

ఇలా మూవీలో అన్ని క్యారెక్టర్స్ క్లిక్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందుకే మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాను అందరూ ఓన్ చేసుకున్నారు.

Also Check – మిడిల్ క్లాస్ మెలొడీస్ రివ్యూ