బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రెడీ అంటున్న మెహరీన్

Wednesday,September 27,2017 - 07:04 by Z_CLU

కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఇప్పుడు శర్వానంద్ సరసన ‘మహానుభావుడు’ సినిమాతో అదే రేంజ్ మ్యాజిక్ స్ప్రెడ్ చేయడానికి వచ్చేస్తుంది. అయితే ఫస్ట్ సినిమాకి, సెకండ్ తరవాత మళ్ళీ ఇన్ని రోజుల గ్యాప్ తీసుకున్నా, ఇక నో మోర్ గ్యాప్స్ అంటుంది.

కృష్ణగాడి వీర ప్రేమగాథ తరవాత ఇమ్మీడియట్ గా ఇంకో సినిమా వర్కవుట్ కాలేదు, అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. ఇకపై ఇంత గ్యాప్ ఉండబోదని అష్యురెన్స్ ఇచ్చింది మెహరీన్. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రతి సినిమాలో తనను కొత్తగా చూస్తారనే గ్యారంటీ కూడా ఇచ్చేస్తుంది.