మెహరీన్ కౌర్ ఇంటర్వ్యూ

Monday,November 27,2017 - 04:19 by Z_CLU

సాయి ధరమ్ తేజ్, మెహరీన్ కౌర్ జంటగా నటించిన ‘జవాన్’ టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. మంచి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ, ఫ్యాన్స్ కి దగ్గరయిన మెహరీన్ ఈ సినిమాలో గ్లామరస్ రోల్ తో కట్టిపడేయనుంది. తన గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో సరికొత్త మెహరీన్ ని చూస్తారు అని కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ హీరోయిన్, మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. అవి మీకోసం…

ఇలాంటి రోల్ కరియర్ లోనే ఫస్ట్ టైమ్

జవాన్ లో చాలా బబ్లీగా,  పెయింటర్ లా నటించాను. ఈ సినిమాలో హీరో కొంచెం సైలెంట్ గా ఉండే క్యారెక్టర్. దానికి నా క్యారెక్టర్ కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటుంది. సాంగ్స్ లో నన్ను నేను చూసుకుని షాక్ అయ్యాను..

డ్యాన్స్ నేర్చుకుంటున్నాను…

నేనసలు ఇప్పటి వరకు డాన్స్ నేర్చుకోలేదు. ఇప్పటి వరకు నా సినిమాల్లో కూడా పెద్దగా డ్యాన్స్ లేకపోవడంతో  ఇప్పటి వరకు బాగానే మ్యానేజ్ చేశాను కానీ, జవాన్ సినిమా కోసం డ్యాన్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాలో మీరు డిఫెరెంట్ మెహరీన్ ని చూస్తారు…

 

అందుకే ఈ సినిమా చేశాను…

ఈ సినిమాలో కంప్లీట్ గ్లామరస్ రోల్ చేశాను. నా ప్రీవియస్ సినిమాలలో పర్ఫామెన్స్ కి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను. కానీ హీరోయిన్ అంటే అన్ని రకాల క్యారెక్టర్స్ చేయాలి. అందునా డైరెక్టర్ ఈ క్యారెక్టర్ నేను చేయగలను ఎప్పుడైతే నమ్మారో, నాకూ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అందుకే ఈ సినిమా చేశాను…

ఇక్కడే బావుంది…

వేరే లాంగ్వేజెస్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. కానీ నాకు తెలుగు ఇండస్ట్రీ బాగా నచ్చింది. నాకు ముంబైలో ఇల్లు ఉన్నా, హైదరాబాద్ లోనే ఎక్కువగా గడుపుతున్నాను…

 

‘ఫిలోరి’ సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోయా…

ఫిలోరీ సినిమా తరవాత ఇక్కడ తెలుగు సినిమాలతో బిజీ అయిపోయా… ‘ఫిలోరి’ రిలీజైన విషయం ఒకటే తెలుసు…  ఆ తరవాత ఆ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై కాన్సంట్రేట్ చేసే టైమ్ కూడా దొరకలేదు. కొన్నాళ్ళకు  మళ్ళీ ముంబై వెళ్ళినప్పుడు, నా పర్ఫామెన్స్ కి వచ్చిన అప్లాజ్ చూసి అసలు ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేయలేకపోయా అనిపించింది…

నెక్స్ట్ ప్రాజెక్ట్స్…

చాలా చూజీగా ఉంటున్నా… ప్రస్తుతం గోపీచంద్ 25 సినిమాకి సంతకం చేశాను. రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి చక్రి డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ జనవరి, ఫిబ్రవరి కల్లా బిగిన్ అవుతుంది.