మెహరీన్ కౌర్ సంగతేంటి...?

Tuesday,May 07,2019 - 10:02 by Z_CLU

‘క్రిష్ణగాడి వీరప్రేమగాథ’తో ఇంట్రడ్యూస్ అయింది. ఫస్ట్ సినిమాతోనే కావలసినంత క్రేజ్ క్రియేట్ అయింది. పెర్ఫామెన్స్… గ్లామర్.. ఇలా చెప్పుకుంటూ పోతే 100% హీరోయిన్ మెటీరియల్ మెహరీన్. రీసెంట్ గా ‘F2’లో ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఆదరగొట్టేసింది. ఆ తరవాతే సైలెంట్ అయిపోయింది. ‘F2’లో ఉన్న స్టార్స్ అందరూ ఇప్పుడు ఫుల్ బిజీ… ఒక్క మెహరీన్ తప్ప.

‘క్రిష్ణగాడి వీరప్రేమగాథ’ తర్వాత వరసగా ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ సినిమాల సక్సెస్ తో మెహరీన్ కి స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కడానికి పెద్దగా టైమ్ పట్టలేదు.  ఆ తరవాత వచ్చిన ‘జవాన్’ సినిమాలో కూడా మెహరీన్ పర్ఫామెన్స్ కి మంచి అప్లాజ్ వచ్చింది.

ఆ తరవాతే వచ్చిన ‘పంతం’, ‘నోటా’ కొద్దిగా నిరాశపరిచినా వీటి తరవాత వచ్చిన ‘F2’ మెహరీన్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టింది. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్, మెహరీన్ కాంబినేషన్ లో ఉండే సీన్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ రావడం, అన్నీ కలిసొచ్చి ‘హనీ ఈజ్ ద బెస్ట్..’ అంటూ మెహరీన్ ప్లే చేసిన క్యారెక్టర్ కోసమే స్పెషల్ గా సాంగ్ ఉండటం.. ఇవన్నీ ఈ బ్యూటీకి కలిసొస్తాయి అనే అనుకున్నారంతా.. కానీ సీన్ రివర్సయింది.

జస్ట్ గ్లామరస్ రోల్సే కాదు అవసరమైతే కామెడీ కూడా మెహరీన్ ఇరగదీస్తుందనే ఇమేజ్,  ఫ్యాన్స్ లో మరిన్ని ఎక్స్ పెక్టేషన్స్ ని సెట్ చేశాయి. దాంతో వచ్చిన ప్రతి కథని కన్సిడర్ చేయకుండా, ఆచి తూచి సంతకం చేయాలనే ఆలోచనలో పడ్డట్టుంది. దాంతో న్యాచురల్ గానే ‘F2’ తరవాత గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ ఏ స్టార్ హీరో సినిమాకి ఈమె సంతకం చేస్తుందో చూడాలి…