నితిన్ సరసన నాని హీరోయిన్

Wednesday,April 12,2017 - 12:03 by Z_CLU

ప్రస్తుతం లై అనే సినిమా చేస్తున్నాడు నితిన్. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఇప్పుడు మనం ఈ సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. లై మూవీ తర్వాత నితిన్ చేయబోయే సినిమా టాపిక్ ఇది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సినిమాలో హీరోయిన్ గా మెహరీన్ ను తీసుకున్నారు. త్వరలోనే అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.

ప్రస్తుతం నితిన్ అమెరికాలో ఉన్నాడు. మరో నెల రోజుల పాటు లై సినిమా షూటింగ్ లోనే ఉంటాడు. దీని తర్వాత కృష్ణ చైతన్య డైరక్షన్ లో చేయబోయే సినిమాను సెట్స్ పైకి తీసుకొస్తాడు. ఈ మూవీలోనే మెహ్రీన్ ను తీసుకున్నారట. ఈ ప్రాజెక్టుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డితో పాటు పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ నిర్మాతలు అనే విషయం తెలిసిందే.

కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చింది మెహ్రీన్ కౌర్. ఆ సినిమా సక్సెస్ తో ఈమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. తెలుగులో ప్రస్తుతం రవితేజతో ఓ సినిమా చేస్తున్న ఈ బ్యూటీ.. సేమ్ టైం కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులు కూడా అంగీకరిస్తూ బిజీ అయిపోయింది.