నాలుగు సినిమాలతో ఫుల్ బిజీ....

Saturday,April 22,2017 - 05:10 by Z_CLU

నాని నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాలో మహాలక్ష్మి క్యారెక్టర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన మెహ్రీన్ టాలీవుడ్ లో వరుస సినిమాలతో హీరోయిన్ గా దూసుకుపోతుంది.. ప్రెజెంట్ ఈ పంజాబీ బ్యూటీ తెలుగులో మూడు సినిమాలు చేస్తూనే మరో బై లింగ్వల్ సినిమాలో నటించడానికి రెడీ అవుతుంది ..

ప్రస్తుతం రవి తేజ సరసన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మెహ్రీన్ మరో వైపు సాయిధరమ్ ‘జవాన్’ సినిమాతో పాటు శర్వానంద్ ‘మహానుభావుడు’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ త్వరలోనే ఈ క్యారెక్టర్స్ తో మరో సారి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయాలనీ చూస్తుంది…ఈ మూడు సినిమాలతో పాటు సందీప్ కిషన్ హీరోగా తమిళ్, తెలుగు లో బై లింగ్వల్ సినిమా గా తెరకెక్కబోతున్న మరో సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ అందుకుంది మెహ్రీన్.. సో లేటెస్ట్ గా ‘ఫీలౌరి’ సిఎంమాతో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ పంజాబీ భామ ప్రెజెంట్ ఈ నాలుగు సినిమాలతో ఈ సంవత్సరమంతా ఫుల్ బిజీ అన్నమాట..