మెహరీన్ కౌర్ ఇంటర్వ్యూ

Thursday,September 28,2017 - 03:05 by Z_CLU

మారుతి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘మహానుభావుడు’ రేపు గ్రాండ్ గా రిలీజవుతుంది. శర్వానంద్, మెహరీన్ జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఈ సందర్భంగా మెహరీన్ కౌర్ ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది అవి మీకోసం….

 

 చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్

ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు మేఘన. OCD ఉన్న పర్సన్ ని లవ్ చేయడం, దాని వల్ల రిలేషన్  లో బిల్డ్ అయ్యే  ప్రాబమ్స్, దానిని మేఘన  ఎలా హ్యాండిల్  చేస్తుంది..? లాంటి  సబ్జెక్ట్  తో  చాలా  ఇంటరెస్టింగ్ గా డిజైన్ చేసిన క్యారెక్టర్ మేఘన.

ఇలాంటి సినిమాలు రేర్ గా వస్తాయి

మారుతి గారి ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలాగే ఇది కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమానే. నాకు తెలిసి ఇలాంటి పాయింట్ తో ఇప్పటివరకు సినిమా రాలేదు. OCD అనేది మరీ ఈ సినిమాలో హీరోకి ఉన్నంతలా లేకపోయినా, మనందరికీ క్లీన్ అండ్ నీట్ విషయంలో కొద్దో గొప్పో ఉండే OCD  ఉంటుందని నా ఫీలింగ్.

ప్రతీది స్పెషలే

ఈ సినిమా గురించి మారుతి గారు చెప్పినప్పుడు అసలు నో చెప్పడానికి ఒక్క రీజన్ కూడా కనిపించలేదు. ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌజ్ UV క్రియేషన్స్… ప్రతీది నాకు స్పెషల్ అనిపించింది. మీకు ఫస్ట్ టైమ్ ఈ మూవీ టీజర్ చూసినప్పుడు ఎలా అనిపించిందో, నేను ఈ సినిమా స్టోరీ విన్నప్పుడు కూడా అలాగే అనిపించింది.

సినిమా మొత్తం OCD చుట్టూ ఉండదు

మహానుభావుడు మూవీ స్టోరీ వేరు, హీరో క్యారెక్టర్ వేరు. హీరో కి OCD ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏం చేశాడు..? ట్రేలర్ లో ఉన్నట్టు అసలు హీరో కుస్తీ ఎందుకు ఆడాల్సి వచ్చింది..? ఈ జర్నీ లో లీడ్ క్యారెక్టర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేదే సినిమా.

BBM తో ఈ సినిమాని కంపేర్ చేయడానికి రీజన్ అదే…

భలే భలే మగాడివోయ్, అలాగే మహానుభావుడు రెండు కూడా కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలే. అందునా ఈ రెండు సినిమాల డైరెక్టర్ మారుతి గారు కావడం వల్ల చాలా మంది ఈ రెండు సినిమాలకు పోలికలున్నాయి అనుకుంటున్నారు కాని, రెండు డిఫెరెంట్ డిఫెరెంట్ కాన్సెప్ట్స్, సినిమా చూస్తే ఎక్కడా మీకు పోలికలు కనిపించవు.

రేపటి నుండి నా టైమ్ బిగిన్ కానుంది

తెలుగులో డెబ్యూ ఫిల్మ్ తరవాత గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే కానీ, కొన్ని ఆఫర్స్ వచ్చినా వర్కవుట్ కాలేదు, ఒక రకంగా చెప్పాలంటే నా టైమ్ రేపటి నుండి బిగినింగ్ అవుతుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఉంటాయి. ప్రతి సినిమాలో సరికొత్త మెహరీన్ ఉంటుంది.

రవితేజలో నచ్చిన పాయింట్ అదే…

రవితేజ అంత సీనియర్ అయి ఉండి కూడా సీనియర్ అని ఫీలింగ్ లేకుండా ప్రతి మూవీని  ఫస్ట్ మూవీ లాగే ఫీల్ అవుతూ, అంతే డెడికేటెడ్ గా ప్రతి షాట్ ని డిస్కస్ చేసి చేస్తారు. డౌన్ టు అర్త్ ఉండే ఆయన ఆటిట్యూడ్ అంటే నాకు చాలా ఇష్టం.