పంజాబ్ కు షిఫ్ట్ అయిన మెహబూబా

Saturday,November 04,2017 - 10:07 by Z_CLU

పూరీ జగన్నాథ్ లేటెస్ట్ మూవీ మెహబూబా. ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ తాజాగా పంజాబ్ కు షిఫ్ట్ అయింది. పంజాబ్ లోని ఇండియా, పాకిస్థాన్ బోర్డర్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నారు. 15 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగుతుంది.

హిమాచల్ ప్రదేశ్ లోని అందమైన లొకేషన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అక్కడే నిన్నటివరకు ఫస్ట్ షెడ్యూల్ కూడా జరిగింది. ఇవాళ్టి నుంచి పంజాబ్ కు షిఫ్ట్ అయింది యూనిట్. ఈ షెడ్యూల్ తర్వాత రాజస్థాన్ లో మూడో షెడ్యూల్ ప్లాన్ చేశారు. దీంతో సినిమాకు సంబంధించి 50శాతం షూటింగ్ పూర్తవుతుంది.

మెహబూబాలో ఆకాష్ సరసన నేహా షెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. 1971 ఇండో-పాక్ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో హార్ట్ టచింగ్ ప్రేమకథగా తెరకెక్కుతోంది మెహబూబా. సందీప్ చౌతా ఈ సినిమాకు సంగీత దర్శకుడు.