శ్రీహరి కొడుకు సినిమా.... రిలీజ్ కి రెడీ !

Sunday,June 02,2019 - 09:50 by Z_CLU

టాలీవుడ్లో కొంత మంది వారసులు హీరోలుగా పరిచయమై వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇప్పుడీ లిస్టులో మరో వారసుడు చేరబోతున్నాడు. స్వర్గీయ శ్రీహరి చిన్న కొడుకు మేఘాంశ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాకు ‘రాజ్ ధూత్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో బైక్ పై కూర్చొని స్టైలిష్ లుక్ లో శ్రీహరి తనయుడు మేఘాంశ్ ఇంప్రెస్ చేసాడు. రోడ్ ప్రయాణం నేపథ్యంలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో అర్జున్ – కార్తీక్ అనే రైటర్స్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఎం.ఎల్.వి సత్యనారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జులైలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

విలన్ గా, హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలతో మెప్పించిన శ్రీహరి వారసత్వాన్ని మేఘామ్ష్ ఎంత వరకూ కొనసాగిస్తాడో..చూడాలి.