మేఘా ఆకాష్ ఇంటర్వ్యూ

Friday,August 04,2017 - 07:43 by Z_CLU

ప్రెజెంట్ కోలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తూ తెలుగులో నితిన్ నటించిన ‘లై’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం కాబోతుంది మేఘ ఆకాష్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11 న థియేటర్స్ లోకి రానున్న సందర్భంగా ఇటీవలే మీడియాతో ముచ్చటించింది ఈ కోలీవుడ్ బ్యూటీ. ఆ విశేషాలు మేఘ ఆకాష్ మాటల్లోనే…

చెన్నై లో పెరిగాను

మా నాన్న ఆకాష్ రాజా , మా అమ్మ బిందు రాజా.. నాన్న తెలుగు వారు అమ్మ మలయాళీ. నేను చెన్నై లో పెరిగాను. చెన్నై లో విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చదివాను. అనుకోకుండా హీరోయిన్ అయ్యాను.

వెంటనే ఓకే చెప్పేశా..

గౌతమ్ మీనన్ గారితో చేస్తున్న సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. డైరెక్టర్ హను గారు ఈ స్క్రిప్ట్, క్యారెక్టర్ చెప్తుండగానే చాలా ఇంప్రెస్స్ అయ్యాను. ముఖ్యంగా క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది. అందుకే వినగానే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశా..


చైత్ర వేరు నేను వేరు

ఈ సినిమాలో చైత్ర అనే బాబ్లీ క్యారెక్టర్ చేస్తున్నాను. చాలా హుషారుగా ఎప్పుడూ ఏదోకటి మాట్లాడుతుండే క్యారెక్టర్. నిజానికి రియల్ లైఫ్ లో నేను చాలా కామ్. సినిమాలో చైత్ర వేరు రియల్ లైఫ్ లో నేను వేరు. పూర్తిగా ఆపోజిట్.

ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ దొరికింది

తమిళ్లో సినిమాలు చేస్తుండగా ఈ సినిమా వచ్చింది. తెలుగులో నా డెబ్యూ ఎలా ఉండాలనుకున్నానో.. అచ్ఛం అలాంటి క్యారెక్టరే దొరికింది. రెండు పాటల కోసం కొన్ని రొమాంటిక్ సీన్స్ కోసం మాత్రమే కాకుండా కథలో ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ ఇది. ఇలాంటి క్యారెక్టర్ తో తెలుగు ఆడియన్స్ ముందుకు రాబోతున్నందుకు చాలా హ్యాపీ గా ఫీలవుతున్నాను

వాటి కంటే ముందే

ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నాను. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ తో ‘ఎన్నై నోకి పాయుమ్ తోట’ సినిమాలో నటిస్తున్నాను. అలాగే బాలాజీ డైరెక్షన్లో ‘ఓరు పక్క కత్తి’ అనే సినిమా చేస్తున్నాను. అవి రెండు షూటింగ్ చివరి దశకు చేరుకున్నాయి. తెలుగులో నేను నటించిన లై వాటి కంటే ముందు రిలీజ్ అవుతుండడం, నా మొదటి రిలీజ్ తెలుగు సినిమా అవ్వడం చాలా సంతోషంగా ఉంది.

నితిన్ చాలా హెల్ప్ చేశాడు

ఈ సినిమా సెట్స్ లోకి వెళ్ళగానే నితిన్ నన్ను రిసీవ్ చేసుకున్న విధానం బాగా నచ్చింది. నాకు తెలియని ఎన్నో విషయాలను చాలా ఓపిగ్గా వివరించేవాడు. తెలుగు రాకపోవడం వల్ల కొన్ని సీన్స్ లో ఇబ్బంది పడుతుంటే కో స్టార్ గా నితిన్ చాల హెల్ప్ చేసి ఎంకరేజ్ చేశాడు. ఎప్పుడూ చాలా సరదాగా మాట్లాడుతుంటాడు.

 

నా మీద ఆయనకీ ఫుల్ కాన్ఫిడెంట్

ఈ సినిమా షూటింగ్ లో ప్రతీ రోజు నన్ను సపోర్ట్ చేస్తూ నా మీద కాన్ఫిడెన్స్ పెట్టుకొని నన్ను ఎంకరేజ్ చేశాడు డైరెక్టర్ హను. ఆయన మేకింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఆయనకీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తీసుకొస్తుంది.


మంచి టీం దొరికింది

ఈ సినిమా కోసం దాదాపు 75 రోజుల పాటు యూఎస్ లోని లాస్ వేగాస్, శాన్ ఫ్రాన్సిస్కో, చికాగో వంటి ప్రదేశాల్లో షూటింగ్ చేశాం. టీం అందరూ చాలా కష్టపడ్డారు. చాలా కష్టమైన షెడ్యూల్ అయినప్పటికీ నాకు దొరికిన మంచి టీమ్ వల్ల సరదాగా ఎంజాయ్ చేస్తూ షూట్ లో పాల్గొన్నాను.

రీజన్ అదే..

ఈ సినిమా చేస్తుండగానే రామ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. కానీ గౌతమ్ మీనన్ సినిమా చేస్తుండడం, రెండు సినిమాలకు ఒకే సారి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడం వల్లే ఆ సినిమా వదులుకున్నాను. రీజన్ అదే. తెలుగులో ఆఫర్స్ వస్తే మరెన్నో సినిమాలు చేయాలనీ ఉంది.

 

మళ్ళీ నితిన్ తోనే..

ప్రెజెంట్ నితిన్ తో తెలుగులో నేను నటించిన మొదటి సినిమా లై నెక్స్ట్ వీక్ రిలీజ్ కావుంది. ఈ సినిమా తరవాత మళ్ళీ తెలుగులో నితిన్ తోనే సినిమా చేస్తున్నాను. నితిన్ – కృష్ణ చైతన్య కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా అది. రీసెంట్ గా స్క్రిప్ట్ విన్నాను. స్క్రిప్ట్ క్యారెక్టర్ నాకు బాగా నచ్చేశాయి. అందుకే ఆ సినిమా ఒప్పుకున్నాను.