Megha Akash - సత్యదేవ్ సరసన ఛాన్స్

Thursday,November 05,2020 - 03:59 by Z_CLU

బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో మోస్ట్ హ్యాపెనింగ్ హీరో అనిపించుకున్నాడు సత్యదేవ్. ఇప్పుడీ హీరో నుంచి వస్తున్న మరో బ్యూటిఫుల్ మూవీ గుర్తుందా శీతాకాలం. తమన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు నాగశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

స‌త్య‌దేవ్‌, త‌మన్న కాంబినేష‌న్ అన‌గానే ట్రేడ్ లో క్రేజ్ వ‌చ్చింది. ఇప్ప‌డు ఈ క్రేజ్ ని రెట్టింపు చేయ‌టానికి మ‌రో బబ్లీ బ్యూటి మేఘా ఆకాష్ వచ్చింది. అవును.. గుర్తుందా శీతాకాలం సినిమాలో మేఘా ఆకాష్ కూడా జాయిన్ అయింది. ఓ గెస్ట్ రోల్ లో ఆమె మెరవనుంది.

ఈ చిత్రాన్ని నాగ‌శేఖ‌ర్ మూవీస్ బ్యాన‌ర్ పై నాగ‌శేఖ‌ర్‌, భావ‌న ర‌వి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రేపట్నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది.

ఎంఎం కీర‌వాణి తనయుడు కాల‌భైర‌వ, ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంగీతం అందిస్తున్నాడు.