మరో సినిమాకు మెగాస్టార్ వాయిస్ ఓవర్ ...

Monday,February 20,2017 - 04:06 by Z_CLU

ఇటీవలే రానా దగ్గుబాటి నటించిన ‘ఘాజీ’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చి రిలీజ్ కి ముందే సినిమాపై హైప్ క్రియేట్ చేసిన మెగా స్టార్ చిరు లేటెస్ట్ గా మరో తెలుగు సినిమాకు వాయిస్ అందిస్తున్నాడు..ఇప్పటికే మూడు సినిమాలకు వాయిస్ ఓవర్ అందించిన చిరు ఆ లిస్ట్ లో మరో సినిమాను చేర్చేశాడు..

వివరాల్లోకెళితే మంచు మనోజ్ నటించిన లెటస్ట్ సినిమా ‘గుంటూరోడు’ మార్చ్ 3న థియేటర్స్ లోకి వస్తున్న సంగతి తెలిసిందే… ఇటీవలే ఆడియో వేడుక జరుపుకున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో మనోజ్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ కి మెగా స్టార్ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించిన యూనిట్ ఇటీవలే చిరుని కలిసి సినిమాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని కోరారట. యూనిట్ అడిగిన వెంటనే వాయిస్ ఓవర్ అందించేందుకు ఓకే చేప్పే ఇందుకోసం కాస్త టైం కేటాయించి మరీ  సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడట చిరు. అంటే ‘గుంటూరోడు’ లో మెగా వాయిస్ ఓవర్ ఓ స్పెషల్ ఎట్రాక్షన్  గా నిలవనుందన్నమాట…