నా పేరు సూర్య సెట్స్ పై సందడి చేసిన మెగాస్టార్

Sunday,April 15,2018 - 06:06 by Z_CLU

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – వక్కంతం వంశీ కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య’ ప్రస్తుతం సాంగ్ షూట్ జరుపుకుంటుంది. అన్నపూర్ణ 7 ఎకరాలు స్టూడియోలో జరుగుతున్న ఈ  సాంగ్ షూట్ లో సందడి చేసి యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు మెగాస్టార్.

విశాల్ శేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి రామజోగయ్య శాస్త్రీ లిరిక్స్ అందించారు. సినిమాలో ఓ  ముఖ్యమైన సందర్భంలో వచ్చే ఈ  మాస్ సాంగ్ ఫాన్స్ తో పాటు అందరినీ అలరించి సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలవనుంది. ఈ సాంగ్ లో బన్నీ డాన్సులు అను ఇమ్మానుయేల్ గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు యూనిట్.