మెగాస్టార్ అప్ కమింగ్ మూవీస్

Sunday,July 23,2017 - 10:03 by Z_CLU

ఇటీవలే సంక్రాంతి బరిలో ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చి హంగామా చేసిన మెగా స్టార్ చిరంజీవి రి ఎంట్రీ కి వచ్చిన రెస్పాన్స్ తో మరో రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్న చిరు ఈ సినిమా తరవాత బోయపాటి శ్రీనుతో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.


సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ కథతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు చిరు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు నుంచి సెట్స్ పైకి రానుందని సమాచారం. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు.


ప్రెజెంట్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమా వర్క్ షాప్ లో పాల్గొంటూనే మరో వైపు బోయపాటి తో యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు చిరు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడని సమాచారం.