శతమానంభవతి సక్సెస్ మీట్ కు మెగాస్టార్

Friday,January 27,2017 - 11:28 by Z_CLU

శర్వానంద్-అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా శతమానంభవతి. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన ప్రతి సెంటర్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అందుకే ఈ సినిమా సక్సెస్ మీట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లో జరగనున్న ఈ సక్సెస్ మీట్ కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు.

శర్వానంద్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన శతమానంభవతి సినిమా… పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టింది. అటు ఓవర్సీస్ లో కూడా సూపర్ హిట్ అవ్వడంతో పాటు… శర్వానంద్ మార్కెట్ ను కూడా పెంచింది. సతీష్ వేగేశ్న డైరక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటికే మంచి వసూళ్లతో థియేటర్లలో కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్-జయసుధ ఎప్పీయరెన్స్ తో పాటు మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్.