అక్టోబర్ 5 నుండి మెగాస్టార్ ‘సైరా’ రెగ్యులర్ షూటింగ్

Wednesday,September 06,2017 - 12:08 by Z_CLU

మెగాఫ్యాన్స్ మ్యాగ్జిమం కాన్సంట్రేషన్ 151 పైనే ఉంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సినిమా సెట్స్ పైకి రాకముందే ఎక్స్ పెక్టేషన్స్ ని రేజ్ చేసేసింది. జస్ట్ సినిమా మేకింగ్ విషయంలోనే కాకుండా ప్రీ ప్రొడక్షన్ విషయంలోను ఏ మాత్రం కాంప్రమైజ్ కాని సినిమా యూనిట్, సినిమా కోసం లావిష్ సెట్స్ ని నిర్మించే పనిలో ఉంది.

ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ లో కనిపించబోతున్న ఈ సినిమాని అక్టోబర్ 5 నుండి సెట్స్ పైకి తీసుకురానుంది సినిమా యూనిట్. చిరు సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమాలో లెజెండ్రీ బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ఒక స్పెషల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. A.R. రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.