రేపట్నుంచి ‘సైరా’ రెగ్యులర్ షూటింగ్

Tuesday,December 05,2017 - 02:02 by Z_CLU

మెగాస్టార్ 151వ మూవీ ‘సైరా’ ప్రీ-ప్రొడక్షన్ కంప్లీట్ అయింది. అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రేపట్నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ లో చిరంజీవి కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఇప్పటికే మేకోవర్ అయ్యారు చిరు. రీసెంట్ గా రిలీజైన పిక్స్ లో చిరంజీవి మీసం, గడ్డంతో కనిపించడమే కాదు.. ఫిజిక్ లో కూడా మార్పు కనిపించింది.

నిజానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కాస్త ముందే ప్రారంభంకావాల్సింది. కానీ సినిమాటోగ్రాఫర్ రవివర్మన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ ఈ మెగా ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కాస్త ఆలస్యమైంది. గతనెలలో సైరాకు సంబంధించి టెస్ట్ కట్ కూడా నిర్వహించారు. చిరంజీవి లుక్ పై అందరూ సంతృప్తి వ్యక్తంచేయడంతో రేపట్నుంచి రెగ్యులర్ షూట్ కు వెళ్తున్నారు.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది.