మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ సినిమా లాంచ్ అయింది

Wednesday,January 31,2018 - 12:46 by Z_CLU

మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సినిమా బిగిన్ అయింది. రాకేశ్ శశి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ రోజే గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ సినిమాతో మెగా డెబ్యూ కి రెడీ అవుతున్న కళ్యాణ్ సరసన మాళవిక హీరోయిన్ గా నటించనుంది.

 

ఈ ఈవెంట్ గెస్ట్ గా అటెండ్ అయిన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొడితే దర్శక  బాహుబలి రాజమౌళి ఫస్ట్ షాట్ కి గౌరవ దర్శకత్వం వహించారు. M.M. కీరవాణి కెమెరా స్విచ్చాన్ చేశారు.

ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా సినిమాను తెరకెక్కిస్తున్నామని తెలిపిన ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి, ఈ సినిమాకి బెస్ట్ టీమ్ పని చేయనుందని తెలిపారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ బిగిన్ కానున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నాడు. యోగేష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సినిమా వారాహి చలనచిత్రం బ్యానర్ పై తెరకెక్కనుంది.