ఫ్యాన్స్ కు మెగా పండగ

Wednesday,September 28,2016 - 03:04 by Z_CLU

మెగాస్టార్ ఖైదీ – 150 టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి అభిమానుల్లో వైబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే రీసెంట్ గా రిలీజ్ అయిన మెగాస్టార్ స్టిల్స్ చూస్తుంటేనే టైటిల్ కింద ఉన్న క్యాప్షన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. బాస్ ఈజ్ బ్యాక్ అన్నది వాస్తవమే అయినా, మెగాస్టార్ చార్మ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తున్నాయి లేటెస్ట్ స్టిల్స్. దాదాపు ఎనిమిదేళ్ళ గ్యాప్ తరవాత తెరకెక్కిన ఖైదీ నం 150 లో చిరంజీవికి 20 ఏళ్ల క్రితం రిలీజైన గ్యాంగ్ లీడర్ సినిమాలోని చిరంజీవికి కించిత్ కూడా తేడా కనిపించడం లేదు.

1

ఇంత గ్యాప్ తరవాత తెరకెక్కుతున్న సినిమా కాబట్టి మెగాస్టార్ లో కొద్దో గొప్పో స్పీడ్ తగ్గే ఉంటుంది అని ఎక్స్ పెక్ట్ చేసిన వారికి పెద్ద షాకే ఇచ్చాడు చిరు. అదే స్టామినా… అంతకు మించిన స్టైల్ కనిపిస్తోంది. ఒకవైపు ఖైదీలా కనిపిస్తూనే, మరో వైపు యంగ్ అండ్ ఛార్మింగ్ లుక్ లో కనిపిస్తున్న చిరంజీవి రెండు స్టిల్స్ లోను అదరగొట్టేశాడు. చిరంజీవిని  అమితంగా ఇష్టపడే వి.వి.వినాయక్ చిరంజీవి లుక్స్ కోసం బాగానే కష్టపడ్డాడు. బేసిగ్గా తాను కూడా చిరంజీవి అభిమాని కాబట్టి, వాళ్ళు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు.

2