చిరు -కొరటాల కాంబో... గెట్ రెడీ....

Saturday,July 14,2018 - 03:12 by Z_CLU

కొన్ని కాంబినేషన్ బజ్ నెలకొల్పి  ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. ప్రెజెంట్  మెగా ఫాన్స్ లో అలాంటి ఇంటరెస్టే కలిగిస్తుంది మెగాస్టార్ -కొరటాల కాంబో. ప్రస్తుతం ‘సైరా’ సినిమాతో బిజీగా ఉన్న చిరు నెక్స్ట్ సినిమాను కొరటాల శివ డైరెక్షన్ లో చేయబోతున్నడంటూ ఇప్పటికే వార్తలొచ్చాయి. కానీ ఇంత వరకూ ఈ కాంబోపై ఎలాంటి క్లారిటీ రాకపోవడంతో ఈ వార్తలో నిజం లేదు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుత సమాచారం మేరకూ ఈ కాంబినేషన్ లో సినిమా ఉంటుందనేది గట్టిగానే వినిపిస్తుంది. ఇప్పటికే చిరుకి సోషల్ ఎలిమెంట్స్ తో కూడిన  ఓ యాక్షన్ కథ వినిపించిన కొరటాల ప్రస్తుతం ఆ కథకు ఫినిషింగ్ ఇచ్చే పనిలో ఉన్నాడని టాక్.

అంతే కాదు ఈ సినిమాలో చిరు మరోసారి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని ముఖ్యంగా అందులో ఒకటి రైతు పాత్ర అని తెలుస్తుంది. ప్రెజెంట్ ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుందని సమాచారం. మటినీ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెని బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించనున్నాడని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నాడని తెలుస్తుంది. మరి ఈ పవర్ ఫుల్ కాంబో అనౌన్స్ మెంట్ మెగా ఫాన్స్ లో ఎలాంటి జోష్ తీసుకొస్తుందో…చూడాలి.