'తేజ్ ఐ లవ్ యు' ఆడియో ...మెగాస్టార్ గెస్ట్

Wednesday,June 06,2018 - 11:45 by Z_CLU

కరుణ కరణ్ డైరెక్షన్ లో  సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘తేజ్‌ ఐ లవ్ యు’  ఆడియో వేడుక  నెల 9 న హైదరాబాద్ లో  ఘనంగా  జరగనుంది. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై  ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటుంది.

 

రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో  సాయి ధరం తేజ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుంది.  గోపీసుంద‌ర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. జూన్‌ 29న ఈ సినిమాను  విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్.