మాస్ అవతార్ లో మెగాస్టార్

Friday,May 19,2017 - 04:32 by Z_CLU

మెగాస్టార్ 151 ఇంకా సెట్స్ పైకి కూడా రాలేదు. అప్పుడే 152 సినిమా ప్రీ ప్రొడక్షన్ బిగిన్ అయిపోయింది. హై ఎండ్ యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ లా తెరకెక్కబోయే ఈ సినిమా కోసం పవర్ ప్యాక్డ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసే ప్లాన్ లో ఉన్నాడు బోయపాటి.

ప్రస్తుతం చిరు ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ సినిమా మేకోవర్ లో బిజీగా ఉన్నాడు. అటు బోయపాటి బెల్లంకొండ సాయి సినిమాని ఫాస్ట్ పేజ్ లో కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉంటూనే, మరోవైపు చిరు సినిమాకి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ ని డిజైన్ చేసుకుంటున్నాడు.

ఖైదీ నం 150 లో డ్యూయల్ రోల్ లో, రేపో మాపో సెట్స్ పైకి రానున్న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లో ఫ్రీడం ఫైటర్ లా కనిపించనున్న చిరంజీవి, బోయపాటి డైరెక్షన్ లో ఏ రేంజ్ మాస్ అవతార్ లో ఎంటర్ టైన్ చేయనున్నాడోనని ఇప్పటి నుండే ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ రేజ్ అవుతున్నాయి.