మెగాస్టార్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్ - 2

Monday,January 09,2017 - 04:51 by Z_CLU

*ఆ ఛాయిస్ చరణ్ దే
మొదట ఈ రీమేక్ సినిమాకు ఏ దర్శకుడైతే బాగుంటాడా అని చాలా ఆలోచించాం. వినాయక్ ఛాయిస్ ముందు చరణ్ దే. ఆ తర్వాత అందరం వినాయకే పర్ఫెక్ట్ అనుకున్నాం. ఈ సినిమా కోసం వినాయక్ కేవలం ఓ దర్శకుడిగా మాత్రమే కాకుండా, అంతకంటే ఇంకా ఎక్కువే కష్టపడ్డాడు.

*ఆ రెస్పాన్స్ ఊహించలేదు
ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ హిట్ అవుతాయని అనుకున్నాం కానీ ఇంతలా రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. సోషల్ మీడియాలో ఒక్కో పాటకి మిలియన్ వ్యూస్ వస్తుండడం చాలా సంతోషం కలిగించాయి. సినిమా విజయంలో సాంగ్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

*ఆ రెండు పెండింగ్ లో పెట్టా
150 వ సినిమా కోసం విన్న రెండు కథల్ని హోల్డ్ లో పెట్టాను. వాటిలో ‘ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి’ కథ ఒకటి కాగా మరొకటి బోయపాటి చెప్పిన కథ.

chiru-312
*బోయపాటి తో ఆ సినిమా చేస్తా
బోయపాటి శ్రీనుతో 152వ సినిమా చేస్తా. అది గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుంది. బోయపాటి చెప్పిన కథ బాగా నచ్చింది. కచ్చితంగా బోయపాటితో సినిమా ఉంటుంది.

*ఆ కాంపిటీషన్ ఉండాలి
సహజంగా మన ఇండస్ట్రీ లో కాంపిటీషన్ ఉంటుంది. అయితే అది హెల్తీ కాంపిటీషన్ గా మాత్రమే ఉండాలి తప్ప గొడవలు క్రియేట్ అయ్యేలా ఉండకూడదు. బాలకృష్ణ, నాకు మధ్య అలాంటి కాంపిటీషన్ ఉండదు. బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా ముహూర్తానికి స్విచాన్ చేయడానికి వెళ్ళినప్పుడు కథ ఎంచుకోవడమే మొదటి సక్సెస్
అని.. అలాంటి కథలకు బాలయ్య పర్ఫెక్ట్ అని కూడా నేను చెప్పాను. అందరితో సన్నిహితంగా ఉండడం నాకు ఎప్పట్నుంచో అలవాటు. ఈ జనరేషన్ హీరోలు కూడా మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. చాలా సంతోషంగా ఉంది.

*సినిమాలో అందరూ కనిపిస్తారు
ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చాడు. ఇక రోలింగ్ టైటిల్ లో మా ఫ్యామిలీ హీరోలంతా కనిపిస్తారు.

chiru-284
*ఫస్ట్ సీన్ తప్ప
ఈమధ్య తెలుగులో అమీర్ ఖాన్ నటించిన పి.కె సినిమా మీరు చేస్తారా? అంటే నా సమాధానం ఫస్ట్ సీన్ తప్ప. (నవ్వుతూ) ఎందుకంటే ఆ సీన్ నేను చేయలేను. పైగా అమీర్ ఖాన్ మంచి పరిపూర్ణత గల నటుడు. ఏ కథ తో అయినా అందరినీ మెప్పించగలడు. అంతటి పర్ఫార్మెన్స్ నేను చేయలేకపోవచ్చు.

 

*చరణ్ విషయంలో అంతా ఓకే…
ధృవ చూసి చాలా హ్యాపీ ఫీలయ్యాను. చరణ్ మంచి సినిమాలు సెలక్ట్ చేసుకుంటున్నాడు. చెర్రీకి ధృవ పర్ ఫెక్ట్ మూవీ. చరణ్ నటనలో మెచ్యూరిటీ కనిపించింది. ధృవ సినిమాతో నటుడిగా మరో స్థాయికి చేరుకున్నాడు.

*నటుడిగా అప్పటివరకూ…
ఏ నటుడైన అభిమానులు, ప్రేక్షకులు రిసీవ్ చేసుకునేంత వరకూ సినిమాలు చెయ్యొచ్చు. ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ అయినా ట్రై చెయ్యొచ్చు. వాళ్ళు రిసీవ్ చేసుకోలేని పరిస్థితిలో మాత్రం ఇంకా బోర్ కొట్టించకుండా రిటైర్ అవ్వడమే మంచిది.

*ఫుల్ కాన్ఫిడెన్స్
ఖైదీ నంబర్ 150పై నాతో పాటు టీం అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఫైనల్ అవుట్ ఫుట్ చూసి మేమంతా ఫుల్ హ్యాపీ. నా సినిమాతో పాటు ఈ సంక్రాంతి కి రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు ఘనవిజయం అందుకొని ఆ సినిమాలకు కష్టపడిన యూనిట్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా.