మెగాస్టార్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ పార్ట్ - 1

Monday,January 09,2017 - 04:20 by Z_CLU

ఖైదీ సినిమా ఎలా ఉంది. అందులో హైలెట్స్ ఏంటి.. ఇంతకీ సినిమాలో చిరంజీవి రోల్ ఏంటి… ఓవరాల్ గా సినిమా ఎలాంటి అంచనాల్ని క్రియేట్ చేసింది. వీటి గురించి మేం చెప్పే కంటే స్వయంగా చిరంజీవే చెబితే ఎలా ఉంటుంది. ఎస్… ఖైదీ డీటెయిల్స్ తో పాటు మరెన్నో బాస్ ఈజ్ బ్యాక్ విశేషాల్ని చిరు మనతో పంచుకున్నారు. మెగాస్టార్ తో
జీ-సినిమాలు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

*నా ఫీలింగ్ మాటల్లో చెప్పలేను..
నా సినిమాలకు సంబంధించి ఎన్నో ఫంక్షన్లు గ్రాండ్ గా జరిగాయి. అప్పుడు ఆ ఫంక్షన్స్ కు అభిమానులు వేలల్లో వచ్చేవారు. కానీ ఇప్పుడు లక్షల్లో వస్తున్నారు. ఆ వేరియేషన్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కి చూశా. అంత మంది అభిమానులను ఆ ఫంక్షన్ లో చూసి ఓ రకమైన సంతోషానికి లోనయ్యాను.

*నేను అలా రియాక్ట్ అవ్వను
రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో నాగబాబు రియాక్ట్ అయిన విధానం చర్చనీయాంశం అయింది. కొందరన్న మాటలకు నాగబాబు బాగా హర్ట్ అయ్యి ఆ విధంగా ఫంక్షన్ లో రియాక్ట్ అయ్యాడు. నేను ఆ కామెంట్స్ ను అస్సలు పట్టించుకోను పైగా రియాక్ట్ అవ్వను. ఎవరైనా మన గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ఏదో కామెంట్ చేస్తే అది వారి నిబద్దతకే
వదిలేస్తా. అందరూ ఒకేలా ఉండరు కదా. అందుకే నాగబాబు అలా ఆవేశంగా రియాక్ట్ అయ్యాడు. వర్మతో నాకెలాంటి విభేదాలు లేవు. కలిసినప్పుడల్లా మాట్లాడుకుంటుంటాం. ఆయన నాకు మంచి స్నేహితుడు.

*ఇదే పర్ఫెక్ట్ అనిపించింది
రీఎంట్రీకి ఇదే పర్ ఫెక్ట్ టైం అనిపించింది. ఎందుకంటే, ఆమధ్య అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ వంటి ఎందరో ప్రముఖులు, శ్రేయోభిలాషులు మళ్ళీ సినిమా చేయాలని చెప్పడం…. అలాగే అభిమానులు కూడా గట్టిగా కోరుకోవడంతో వై నాట్ అనిపించింది. అయితే రీఎంట్రీకి మంచి కథ కావాలని దాదాపు సంవత్సరం పాటు వెయిట్ చేశా. ఆ గ్యాప్ లో చాలా కథలు విన్నాను. కానీ రీఎంట్రీ ఇస్తే ఒక మంచి మెసేజ్ తో అన్ని అంశాలు కూడిన కథ అయితే బాగుంటుందని
ఆలోచిస్తున్న టైంలో ‘కత్తి’ సినిమా చూశాను. ఆ కథ బాగా నచ్చడంతో ఇక రీఎంట్రీకి ఇదే పర్ఫెక్ట్ స్టోరీ అని ఫిక్స్ అయిపోయా.

chiru-308
*ఆ క్రెడిట్ కాజల్ దే…
ఈ సినిమాలో కాజల్ నాకు పెయిర్ గా నటించింది. ఇక చరణ్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని మళ్ళీ నాతో కలిసి నటించింది. నిజం చెప్పాలంటే కొడుకు సరసన నటించి మళ్ళీ తండ్రితో హీరోయిన్ గా నటించిన ఘనత ఈతరం హీరోయిన్స్ లో కాజల్ కే దక్కింది.

*మార్పు గమనించా…
దాదాపు 10 ఏళ్ల తర్వాత లైట్స్ కెమెరా యాక్షన్ అనే మాటలు విని హీరోగా చాలా సంతోషం వేసింది. ఇది కదా మన ఏరియా అనుకున్నాను. ఇక అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు గమనించాను. ముఖ్యంగా అప్పట్లో ఫిలిం ఉండేది ఇప్పుడు క్యూబ్ మరియు ఇతర టెక్నాలజీలతో డిజిటల్ గా సినిమా మేకింగ్ లో ఎంతో మార్పు వచ్చింది. డి.ఐ వంటి ఎన్నో డిజిటల్ టెక్నాలజీస్ వల్ల సినిమా ఇంకాస్త గ్లామర్ గా కనిపిస్తోంది

chiru-195
*నాకు అందులో జీరో నాలెడ్జ్
సినిమా ఫస్ట్ కాపీ వచ్చే వరకూ ఓ నటుడిగా ఎంతైనా కష్టపడతా. ఆ తర్వాత కలెక్షన్లు, రికార్డ్స్ లాంటివి పట్టించుకోను. కలెక్షన్స్ పద్దులో నాకు జీరో నాలెడ్జ్. ఒకప్పుడు సినిమా ఆడిన రోజులు మాట్లాడేవి కానీ ఇప్పుడు లెక్కలు మాట్లాడుతున్నాయి. ఈ సినిమా విషయంలో నేను ఫస్ట్ కాపీ వరకే పట్టించుకుంటా. అది వచ్చాక మిగతావేవీ పట్టించుకోను. అవన్నీ చరణే చూసుకుంటాడు (నవ్వుతూ)

*అన్నీ కుదరాలిగా..
ఇటీవలే మా ఫ్యామిలీతో సుబ్బరామిరెడ్డి ఓ సినిమా నిర్మిస్తానని ఫంక్షన్ లో చెప్పారు. అయితే దానికి అన్ని కుదరాలి. ఏదైనా కాలమే నిర్ణయిస్తుంది.

*నా కొడుకే నా ట్రైనర్
ఈ సినిమాకు ఫిజిక్ బాగా మెయింటైన్ చేశారు. ఎక్కడ ట్రయిన్ అయ్యారు అని అందరూ అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నా లుక్ పై చరణ్ స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అది తినకండి ఇవి తినండి, ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని చెబుతూ… డైట్, జిమ్ విషయంలో నాకోసం ట్రయిలర్ గా మారిపోయాడు. కొడుకుగా కాకుండా ఓ నిర్మాతగా నా మీద చాలా కేర్ తీసుకున్నాడు కాబోలు (నవ్వుతూ)

chiru-289
*పవన్ అందుకే రాలేకపోయాడు
లేటెస్ట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ రాకపోవడంలో ఎటువంటి విబేధాలు లేవు. ఆ టైంలో రావడం కుదరలేక పోవడం వల్లే రాలేదు కానీ వేరే రీజన్ ఏం లేదు. ఇక ఈ మధ్య ఓ ఫంక్షన్ కి వెళ్లారు గా అంటే అది లోకల్ లో జరిగింది. పైగా పవన్ కి అప్పుడు కుదిరింది వెళ్ళాడు. ఇప్పుడు కుదరలేదు రాలేకపోయాడు అంతే.

*మళ్ళీ ఆ స్టెప్ వేశా
ఇక లారెన్స్ ఓ పాటలో మళ్ళీ వీణ స్టెప్ ను మరో రకంగా వేయించాడు. అదో సిగ్నేచర్ స్టెప్ కావడం వల్లే మళ్ళీ నాతో లారెన్స్ బలవంతంగా ఆ స్టెప్ వేయించాడు. దాదాపు 10 ఏళ్ల నుంచి డాన్సులు వేయలేకపోయా. ఈ మధ్య శ్రీజ సంగీత్ లో అలా డాన్స్ చేశా అంతే. మొన్నటివరకూ మ్యూజిక్ వినిపించినప్పుడు రేసుగుర్రంలో శృతి హాసన్ లా లోలోపలే డాన్సులు వేసే వాడిని.