మెగాస్టార్ టైటిల్ తో మరో సినిమా

Friday,January 31,2020 - 10:02 by Z_CLU

 మరో సినిమా మెగాస్టార్ టైటిల్ తో రిలీజ్ కానుంది. అయితే ఈ ఒక్క సినిమాకే మెగాస్టార్ సినిమా ఒక్క టైటిల్ సరిపోదన్నట్టు ఏకంగా రెండేసి టైటిల్స్ ని కలిపి ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్. కాకపోతే ఇది తెలుగు స్ట్రేట్ సినిమా కాదు.

తమిళంలో జీవా హీరోగా నటించిన ఓ సినిమాని తెలుగులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకి ‘స్టాలిన్’ అనే టైటిల్ ఫిక్స్ అయ్యారు. అంతేనా.. దానికి ట్యాగ్ లైన్ వరకు వచ్చేసరికి మళ్ళీ మెగాస్టార్ సినిమాల్లోంచే సర్దుకున్నారు. చివరికి ‘అందరివాడు’ సూట్ అయ్యేలా ఉందనుకుని ‘స్టాలిన్… అందరివాడు’ గా ఫిక్సయి త్వరలో తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.

మెగాస్టార్ కి ఏ స్థాయిలో క్రేజ్ ఉంటుందో ఆయన సినిమా టైటిల్స్ కో అదే స్థాయిలో రీచ్ ఉంటుంది. అందుకే తెలుగు హీరోలైనా అక్కడక్కడా ఈ టైటిల్స్ పెట్టుకోవడానికి ఆలోచిస్తారేమో కానీ, తమిళ హీరోలు ఏ మాత్రం తగ్గకుండా మెగా టైటిల్స్ పై క్రేజ్ పెంచేసుకుంటున్నారు. నిన్నా మొన్నటి వరకు కార్తీ ఈ వరసలో ఉన్నాడు.. ఇప్పుడు చిన్నగా జీవా కూడా వస్తున్నాడు.