Lucifer Remake లాంచ్ డీటెయిల్స్ !

Monday,January 18,2021 - 06:20 by Z_CLU

మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ సినిమాను మెగాస్టార్ చిరంజీవి  తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. జయం మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్న ఈ సినిమా జనవరి 21 న ఘనంగా లాంచ్ కానుందని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిన ఈ రీమేక్ సినిమాలో నటించబోయే నటీ నటుల ఎంపిక జరుగుతుంది. నయనతార ను ఇందులో ఓ కీ రోల్ కోసం తీసుకున్నట్లు సమాచారం. సత్య దేవ్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.

మరో మూడు రోజుల్లో లాంచ్ కానున్న ఈ సినిమా మార్చ్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ముందుగా హైదరాబాద్ లో భారీ షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారట.  భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాను NV ప్రసాద్ , రామ్ చరణ్ కలిసి సంయుక్తంగా నిర్మించనున్నారని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు తెలియనున్నాయి. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో  చిరు కొత్త గెటప్ లో కనిపించనున్నారు.