అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్న మెగాస్టార్

Saturday,December 15,2018 - 12:02 by Z_CLU

ప్రస్తుతం ‘సైరా’ టీమ్ మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో అండర్ వాటర్ సీక్వెన్సెస్ ని తెరకెక్కించే  ప్రాసెస్ లో ఉంది ‘సైరా’ టీమ్. అయితే ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ముంబై కి వెళ్ళి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట మెగాస్టార్.

వార్ సీక్వెన్సెస్ హైలెట్ కానున్న ఈ సినిమాలో అండర్ వాటర్ ఫైట్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నాయి ఇన్ సైడ్ సోర్సెస్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రతి సన్నివేశాన్ని మరింత గ్రాండ్ గా ప్రెజెంట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజర్.