మెగాస్టార్ గెస్ట్ గా ‘గీతగోవిందం’ సెలెబ్రేషన్స్

Friday,August 17,2018 - 05:55 by Z_CLU

సూపర్ హిట్టయింది విజయ్ దేవరకొండ ‘గీతగోవిందం’. సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ తో పాటు, మౌత్ టాక్ తో అటు యూత్ లోను, ఫ్యామిలీ ఆడియెన్స్ లోను క్రేజ్ క్రియేట్ చేసుకుంటున్న ఈ సినిమా, మొదటి రోజే సక్సెస్ ట్రాక్ ఎక్కేసింది. అయితే అదే జోష్ లో ఈ నెల 19 న గ్రాండ్ గా ఈ సినిమా సక్సెస్ ని సెలెబ్రేట్ చేసుకోనుంది గీతగోవిందం టీమ్. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవుతున్నాడు.

నిజానికి వైజాగ్ లో జరిగిన ప్రీ రిలీజ్ కే చిరు అటెండ్ కావాల్సింది. కానీ కుదరకపోవడంతో ఈ సక్సెస్ ఈవెంట్ కి అటెండ్ అవుతున్నాడు. హైదరాబాద్ లోని కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ బ్లాక్  బస్టర్ సెలెబ్రేషన్స్ కి భారీ స్థాయిలో ఫ్యాన్స్ అటెండ్ కానున్నారు.

పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కిందీ గీతగోవిందం సినిమా. ఆగష్టు 15 న వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ సినిమాకి గోపీ సుందర్ మ్యూజిక్ కంపోజర్. బన్ని వాసు ప్రొడ్యూసర్. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పించాడు.