God Father రామ్ చరణ్ ఛాయిసే

Thursday,September 29,2022 - 12:17 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి , సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గాడ్ ఫాదర్’ సినిమా అక్టోబర్ 5న దసరా స్పెషల్ గా రిలీజవుతుంది. ఈ సందర్భంగా మేకర్స్ అనంతపురంలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో చిరు మెగా స్పీచ్ ఆకట్టుకుంది. ఈ సినిమాను తనకి సజిస్ట్ చేసి మీరు చేస్తే బాగుంటుందని చెప్పింది రాం చరణ్ అంటూ వేదికపై గాడ్ ఫాదర్ ఛాయిస్ వెనకున్నది తనయుడే అంటూ చెప్పారు చిరు.

మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ ” వైజాగ్ లో ఒంటి గంట వరకూ షూటింగ్ చేసి అక్కడి నుండి స్పెషల్ ఫ్లైట్ లో రావాలనుకున్న నాకు ఫ్లయిట్ లేట్ అవ్వడం జరిగింది. అసలు ఈవెంట్ కి రాగాలనా ? అనే మీమాంశలో ఉండిపోయాను. కానీ మీ అందరి ప్రేమ నన్ను ఎలాగైనా ఇక్కడికి వచ్చేలా చేసింది. లూసిఫర్ మలయాళం లో విడుదలైనప్పుడు నేను చూడటం జరిగింది. ఆ సినిమా గాడ్ ఫాదర్ గా మారడానికి నేను చేయడానికి ప్రధాన కారణం రాం చరణ్. డాడీ నేను సినిమా చూశాను. మీ ఇమేజ్ కి ఈ సమయంలో చేయాల్సిన సబ్జెక్ట్ లూసిఫర్. చరణ్ కోరిక మేరకు ఇది గాడ్ ఫాదర్ గా రూపాంతరం చెందింది. ఈ సందర్భంగా ఈ సినిమా సజిస్ట్ చేసిన చరణ్ థాంక్యూ. ఈ సబ్జెక్ట్ కి డైరెక్టర్ గా ఎవరుంటే బాగుంటుంది ? అని సందేహం ఉన్నప్పుడు అది కూడా చరణే చెప్పాడు. ఈ సినిమాకు మన ధ్రువ మాతృక తనిఒరువన్ తీసిన మోహన్ రాజా అయితే న్యాయం చేయగలరు అని సజిస్ట్ చేశాడు. మోహన్ రాజా ఈ సినిమాని మనందరం గర్వపడేలా తీశారు. దాదాపు ఆరు నెలలు పాటు మిత్రుడు సత్యానంద్ తో కలసి మీ అందరూ ఆనందించేలా ఈ సినిమా స్క్రీన్ ప్లే చేయడం జరిగింది. ఆ స్క్రీన్ ప్లేని అత్యద్భుతంగా తెరకెక్కించారు మోహన్ రాజ్. మోహన్ రాజా మామూలు దర్శకుడు కాదు. ఆయనవి అన్నీ పెద్ద కోరికలు. ఈ సినిమాలో నాకు దళపతిగా వుండే ఒక పాత్ర వుంది, ఆ పాత్ర కోసం సల్మాన్ ఖాన్ అయితే బావుటుందని చాలా సింపుల్ గా చెప్పారు. రాజా అంత సింపుల్ గా చెప్పారు కానీ అసలు సల్మాన్ ఖాన్ ని తీసుకురావడం సాధ్యమేనా అని అలిచిస్తున్నపుడు రామ్ చరణ్ ఆ భాద్యత తీసుకున్నారు. ”నాన్న గారి సినిమాలో ఒక పాత్ర వుంది మీరు చేస్తే బావుంటుంది” అని చరణ్ చెప్పడం,, ”నేను చేయాలని చిరు గారు కోరితే.. ఆ పాత్ర చేయడానికి నేను సిద్ధమే.. కథ కూడా చెప్పొద్దు. నేరుగా షూటింగ్ కి వచ్చేస్తా’ అని సల్మాన్ అన్నారు. మాపై ఇంత ప్రేమ చూపించిన సల్మాన్ భాయ్ కి కృతజ్ఞతలు. చరణ్ తో కలసిసూపర్ గుడ్ ఫిలింస్ ఆర్‌బి చౌదరి గారు, ఎన్‌వి ప్రసాద్ గారు ఈ సినిమాని ఎంతో భారీగా నిర్మించారు. వారికి కృతజ్ఞతలు. నయనతార పాత్ర ఇందులో అత్యద్భుతంగా వచ్చింది. సెకండ్ హాఫ్ లో అద్భుతమైన సెంటిమెంట్ గొప్పగా పండించారు. నయనతారకి హ్యాట్సప్. ఇందులో ప్రతినాయకుడిగా సత్యదేవ్ చేశారు. నాకు ఎదురుగా నిలబడే పాత్రది. సత్యదేవ్ అద్భుతమైన నటుడు. ఇందులో ఆయన నటనని పరిపూర్ణంగా వాడుకున్నాం. సత్యదేవ్ కి చాలా మంచి భవిష్యత్ వుంది. మన కళ్ళముందే సత్యదేవ్ సూపర్ స్టార్ గా ఎదుగుతాడు. మురళి శర్మ పాత్ర చాలా వైవిధ్యంగా వుంటుంది. సముద్రఖని ఇందులో మరో ప్రతి నాయకుడి గా శభాష్ అనిపించారు, సునీల్, షఫీ, గెటప్ శ్రీను పాత్రలు కూడా ఆసక్తికరంగా వుంటాయి. ఇందులో దర్శకుడు పూరి జగన్నాధ్ ఇందులో యూట్యుబర్ గా కనిపించి పాత్రలని కథని పరిచయం చేస్తారు. ఆయన రాకతో కథలో ఒక ఫ్రెష్ నెస్ వస్తుంది. వీరంతా కలసి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళారు. ” అన్నారు.

 

 

* Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics