టాలీవుడ్ కు మరో స్టార్ దొరికాడు: చిరంజీవి

Monday,August 20,2018 - 10:43 by Z_CLU

గీతగోవిందం సక్సెస్ తో విజయ్ దేవరకొండ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ దొరికాడని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సక్సెస్ సంబరాల్లో పాల్గొన్న చిరు, స్టార్ క్లబ్ లోకి విజయ్ దేవరకొండను గ్రాండ్ గా ఆహ్వానించారు.

“ఖైదీ, అడవిదొంగ, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్లు లేవు వంటి సినిమాలతో యాక్షన్‌ హీరోగా నేను దూసుకెళుతున్న టైమ్‌లో.. విజేత మూవీ ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ మూవీ. ఈ పాత్రలో నన్ను ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న మీమాంస నాకు, అరవింద్‌ గారికి ఉండేది. ఆ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసి, ఆల్‌ క్లాస్‌ హీరో అనిపించింది. గీత గోవిందం సినిమా కూడా విజయ్‌ని ఆల్‌ క్లాస్‌ హీరో అనిపించింది. విజయ్‌కి ఇది ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌. నీకు చాలా భవిష్యత్‌ ఉంది. ఈ సినిమాతో నీకు స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. ఇండస్ట్రీలోని టాప్‌స్టార్స్‌లో విజయ్‌ ఒక్కడు అయినందుకు స్వాగతిస్తున్నా. మన ఇండస్ట్రీకి దక్కిన మరో అరుదైన స్టార్‌ విజయ్‌ దేవరకొండ.”

ఇలా విజయ్ దేవరకొండను మెచ్చుకున్నారు మెగాస్టార్. 1978 నుంచి తను 30 సినిమాలు చేస్తే, ఖైదీతో తనకు స్టార్‌ హీరో స్టేటస్‌ వచ్చిందని, విజయ్ దేవరకొండకు అలాంటి స్టేటస్ గీతగోవిందంతో వచ్చిందని అన్నారు చిరు.