త్రివిక్రమ్ డైరెక్షన్ లో మెగాస్టార్ సినిమా

Friday,December 28,2018 - 03:38 by Z_CLU

మెగా ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయని అప్డేట్ ఇది. నిన్న జరిగిన ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి స్వయంగా ఈ సినిమాని అనౌన్స్ చేయడంతో, మెగా ఫ్యాన్స్ లో వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతున్న ‘వినయ విధేయ రామ’ సినిమా నిర్మాత, D.V.V. దానయ్య ఈ సినిమాని కూడా నిర్మించనున్నాడు.

రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘అరవింద సమేత’ తరవాత త్రివిక్రమ్ ఇంకా తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు. అటు మెగాస్టార్ కూడా ‘సైరా’ తరవాత ఇమ్మీడియట్ గా కొరటాల డైరెక్షన్ లో సెట్స్ పైకి వస్తాడనే టాక్ గట్టిగానే నడుస్తుంది. వీటి మధ్య సర్ ప్రైజింగ్ గా, త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా అని అనౌన్స్ చేయడం, సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ వైబ్స్  క్రియేట్ చేస్తుంది.

ఇంతకీ ‘సైరా’ తర్వాత సెట్స్ పైకి రానున్న సినిమా ఇదేనా..? లేకపోతే కొరటాలతో సినిమా చేశాకే చిరు, త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడా..? ఈ మోస్ట్ క్యూరియస్ క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.