Chiranjeevi మెగా రికార్డ్!

Tuesday,December 07,2021 - 05:22 by Z_CLU

సాధారణంగా పెద్ద స్టార్ హీరో సినిమాలు ఒక్కొక్కటి గా సెట్స్ పైకి వెళ్తుంటాయి. లేదా నెల గ్యాప్ లో షూటింగ్ జరుపుకుంటాయి. కానీ ఇప్పుడు సరికొత్త రికార్డ్ నెలకొలిపారు మెగాస్టార్. అవును చిరంజీవి మెగా రికార్డ్ నెలకొల్పి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘ఖైదీ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నారు చిరు. ‘ఖైదీ 150’ తర్వాత ‘సైరా నరసింహా రెడ్డి’ దాని తర్వాత ‘ఆచార్య‘ ఇలా ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక మరొకటి సెట్స్ పై పెట్టుకుంటూ వచ్చిన మెగాస్టార్ ఇప్పుడు ఒకేసారి నాలుగు పెద్ద సినిమాలు సెట్స్ పై పెట్టేసి ఒకే నెలలో నాలుగు షూటింగ్స్ జరుపుకున్నారు.

నిజంగా ఇది ఓ అరుదైన రికార్డే. అందుకే దీనికి మెగా రికార్డ్ అంటూ ఫ్యాన్స్ పేరు పెట్టేశారు. ప్రస్తుతం కొరటాల దర్శకత్వంలో తనయుడు రామ్ చరణ్ తో కలిసి ‘ఆచార్య’ చేస్తున్న చిరు మోహన్ రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్‘ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు మెహర్ రమేష్ తో ‘భోళా శంకర్‘, అలాగే బాబీ సినిమాను కూడా సెట్స్ పై పెట్టేసి షూటింగ్ మొదలు పెట్టేశారు. అందులోకి ఒకే నెలలో నాలుగు షూటింగ్స్ లో పాల్గొని కొత్త రికార్డ్ సృష్టించాడు.

ఏదేమైనా జెట్ స్పీడులో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకి సైతం గట్టి పోటీ ఇస్తూ ముందుకు వెళ్తున్న చిరు ఇదే స్పీడుతో నెక్స్ట్ సినిమాలు కూడా ప్లాన్ చేసుకుంటున్నారట. నెక్స్ట్ మెగా లిస్టులో బోయపాటి, మారుతీ, వెంకీ కుడుముల ఇలా కొన్ని పేర్లు వెనబడుతున్నాయి. ఏదేమైనా వచ్చే ఏడాది చిరు నుండి రెండు లేదా మూడు సినిమాలు రావడం పక్క. వచ్చే ఏడాది వరుస మెగా సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి గుర్తుండిపోయే ఇయర్ అవ్వడం ఖాయం.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics