మెగాస్టార్ బర్త్ డే స్పెషల్

Tuesday,August 22,2017 - 08:34 by Z_CLU

మెగాస్టార్… ఈ పేరు వింటే చాలు అభిమానుల్లో వెయ్యి మెగా వాట్ల వోల్టేజ్ జెనెరేట్ అవుతుంది. స్వయంకృషి, కృష్టితో నాస్తి దుర్భిక్షం లాంటి  పదాలకు నిలువెత్తు నిదర్శనం చిరు. శివ శంకర వర ప్రసాద్ నుండి మెగాస్టార్ వరకు ఎదిగిన చిరంజీవి జీవితం అందరికీ ఆదర్శం.

22 ఆగష్టు 1955 లో పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో జన్మిచిన చిరంజీవి ఈ రోజు 62వ బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ‘పునాది రాళ్ళు’ సినిమాతో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకు వచ్చినా, సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన సినిమా ప్రాణం ఖరీదు. అక్కడి నుండి బిగిన్ అయిన మెగా ప్రయాణం 151 వ సినిమా వరకు సినిమా సినిమాకి క్రేజ్ పెంచుకుంటూనే ఉంది.

టాలీవుడ్ లో మోస్ట్ స్టైలిష్ యాక్టర్, డ్యాన్సర్ లా  కుర్రకారు గుండెల్లో జోష్ ని నిద్రలేపిన మెగాస్టార్, మెగా తరంగంలా దూసుకుపోయారు. ఈ రోజు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలిగిపోతున్న చాలామంది చిరంజీవిని ఇన్స్ పిరేషన్ గా తీసుకున్న వాళ్ళే. తన 35 ఏళ్ల సినీ ప్రయాణంలో చిరంజీవి టచ్ చేయని జోనర్ లేదు. స్వయంకృషి, రుద్రవీణ లాంటి మెసేజ్  ఓరియంటెడ్ సినిమాలు చేసినా, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు లాంటి అల్ట్రా కమర్షియల్ ఎంటర్ టైనర్ అయినా, సినిమా ఎలాంటిదైనా మెగా మ్యాజిక్ వర్కవుట్ అవ్వాల్సిందే.

చిరంజీవి కరియర్ లో నంది అవార్డు తెచ్చి పెట్టిన సినిమా పునాది రాళ్ళు. చిరు ఫస్ట్ టైమ్ మేకప్ వేసుకున్నది ఈ సినిమా కోసమే. రాజ్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కరియర్ కి బోలెడంత లక్ ని తెచ్చిపెట్టింది. తన కరియర్  లో 4 నంది అవార్డులను అందుకున్న చిరంజీవి 6 ఫిల్మ్ ఫేర్ అవార్డులతో  పాటు  2006  లో అత్యంత ప్రతిష్టాత్మకమైన  పద్మభూషణ్  అవార్డును  అందుకున్నారు.

కరియర్ బిగినింగ్ లో పర్ఫామెన్స్ కి స్కోప్ ఉండాలే కానీ విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ కి కూడా ప్రిఫరెన్స్ ఇచ్చిన చిరు ‘మోసగాడు’ సినిమాలో విలన్ లా నటించి మెప్పించాడు. శోభన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఒక్కో మెట్టు జాగ్రత్తగా ఎక్కుతూ కరియర్ ని ప్లాన్ చేసుకున్న చిరంజీవికి ఈ సినిమా మొట్టమొదటి టర్నింగ్ పాయింట్. అక్కడి నుండి బిజీ అయిన చిరంజీవి 80’s బిగినింగ్ లో ఒక్కో  ఏడాది ఏకంగా 15 సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.

యముడికి మొగుడు, ఖైదీ నం 786, మరణ మృదంగం, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, స్టేట్ రౌడీ.. ఇలా చెప్పుకుంటూ పోతే బ్యాక్ టు బ్యాక్ కమర్షియల్ హిట్స్ తో చిరంజీవి కంప్లీట్ గా ఒక జనరేషన్ ని రూల్ చేశారు.

1990 లో రిలీజైన కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ముఠామేస్త్రి, రౌడీ అల్లుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే వరసగా అన్నీ బ్లాక్ బస్టర్లే. అలా ఇండస్ట్రీకి ఐకాన్ లా తయారయ్యారు.

2000 లో మెచ్యూర్డ్ రోల్స్ ని పోషించడం స్టార్ట్ చేసిన చిరు ఇంద్ర, ఠాగూర్, శంకర్ దాదా MBBS, అందరివాడు లాంటి సినిమాలతో మెస్మరైజ్ చేశాడు.

ఆ మధ్య పాలిటిక్స్ పై ఫుల్ టైమ్ ఫోకస్ పెట్టిన మెగాస్టార్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నా రీసెంట్ గా సంక్రాతికి ‘ఖైదీ నం 150’ తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తన 151 వ సినిమాతో రెడీ అవుతున్నారు. ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రలో కనిపించనున్న మెగాస్టార్ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని, ఆయన ఇలాంటి మరెన్నో సినిమాలు చేసి అలరించాలని మనస్పూర్తిగా కోరుకుంటోంది జీ సినిమాలు.