మహానటితో మెగాస్టార్ అనుబంధం

Wednesday,May 09,2018 - 12:17 by Z_CLU

చాలామందికి తెలియని ఓ ఇంట్రెస్టింగ్ మేటర్ ను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. మహానటి రిలీజ్ సందర్భంగా ఆ సినిమా గురించి మాట్లాడిన చిరు, సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. తన తొలి చిత్రంలో సావిత్రితో కలిసి నటించారు మెగాస్టార్.

“నాకు మాత్రమే దక్కిన అదృష్టం ఏంటంటే.. నా కెరీర్ కు పునాది వేసిన పునాది రాళ్లు చిత్రంలోనే సావిత్రి గారితో కలిసి నటించే అదృష్టం దక్కింది. గ్లిజరిన్ లేకుండా కన్నీళ్లు కార్చగలిగే ఉత్తమ నటి, కళ్ల కదలికతోనే హావభావాలు పలికించి, తాను కదలకుండా కథంతా నడిపించే మహానటి కేవలం సావిత్రి గారు మాత్రమే.”

ఇలా సావిత్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు చిరంజీవి. ఓ నటిగా, వ్యక్తిగా, అమ్మగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచిపోయిన సావిత్రమ్మ, ఈ చిరంజీవి మనసులో ఎప్పటికీ చిరంజీవే అన్నారు మెగాస్టార్. అలాంటి మహానటి మీద బయోపిక్ తీసి, నేటి తరానికి ఆమె గొప్పదనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న యూనిట్ మొత్తానికి అభినందలు తెలిపారు చిరు.