మెగాస్టార్ 152 – ఈసారి కూడా బాలీవుడ్

Tuesday,October 22,2019 - 09:02 by Z_CLU

చిరు – కొరటాల సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయబోయేది ఎవరు..? ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ జరుపుకుని అతి త్వరలో సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమా కోసం ఎవర్ని ఎంచుకోబోతున్నారు మేకర్స్..? కొరటాలకు కలిసొచ్చిన మ్యూజిక్ కంపోజర్ ని ప్రిఫర్ చేస్తారా..? లేకపోతే మెగా స్టాండర్డ్స్ కి తగ్గట్టు ‘సైరా’ తరహాలో బాలీవుడ్ కంపోజర్స్ ని ఎంచుకుంటారా..? సెకండ్ ఆప్షన్ కే అవకాశాలు ఎక్కువ.

ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ ఈ సినిమా కోసం అజయ్ – అతుల్ తో డిస్కర్షన్స్ జరుగుతున్నాయనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. సైరా విషయంలో కూడా అంతే.. ఈ సినిమా విషయంలో బిగినింగ్ నుండి బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ పేర్లే వినిపించాయి. చివరికి అమిత్ త్రివేది ఫిక్సయ్యాడు. ఈ సినిమాకి కూడా ఆ స్ట్రాటజీనే  ఫాలో అవుతున్నారు మేకర్స్.

మెగాస్టార్ కమ్ బ్యాక్ మూవీకి DSP మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇక కొరటాల విషయానికి వస్తే చేసిన 4 సినిమాలకూ DSP నే మ్యూజిక్ కంపోజర్. దీంతో ఈసారి కూడా చాయిస్ మారే అవకాశాలు లేవనుకున్నారంతా… కానీ మేకర్స్ మూమెంట్స్ గమనిస్తుంటే మ్యూజిక్ విషయంలో ఈసారి కూడా బాలీవుడే బెస్ట్ చాయిస్ అని ఫిక్సయ్యారనిపిస్తుంది.

అయితే అజయ్ – అతుల్ కాకపోతే ఈ ప్లేస్ లో ఇంకెవరైనా కన్ఫమ్ అవ్వచ్చు.. కానీ ఫిక్సయ్యేది మాత్రం ఖచ్చితంగా బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్సే… అది మాత్రం కన్ఫమ్ అనిపిస్తుంది. దర్శకుడు కొరటాలకి బాలీవుడ్ టెక్నీషియన్స్ తో పని చేయడం ఇదే ఫస్ట్ టైమ్.