మెగా వీకెండ్ మస్తీ

Sunday,October 23,2016 - 10:54 by Z_CLU

తన భర్త, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ వస్తుంటారు ఉపాసన. చెర్రీకి సంబంధించి ఫ్యాన్స్ కు తెలియని కొత్త విషయాలు చెబుతుంటారు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉపాసన.. అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తుంటారు. తాజాగా మెగాభిమానులకు వీకెండ్ గిఫ్ట్ అంటూ ఉపాసన పోస్ట్ చేసిిన ఈ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో రామ్ చరణ్ సీరియస్ గా ఎక్సర్ సైజ్ చేస్తున్నాడు. పాటలు వింటూ, మోస్ట్ ఎనర్జిటిక్ గా ఎక్సర్ సైజు చేస్తున్న చెర్రీని, తన ఫోన్ తో వీడియో తీసి, అభిమానులతో పంచుకుంది ఉపాసన.