వారం రోజులకే రూ.108 కోట్లు

Wednesday,January 18,2017 - 06:06 by Z_CLU

సినిమా రిలీజై వారం దాటుతున్నా కలెక్షన్ల వర్షం ఆగట్లేదు. జస్ట్ 7 డేస్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 76 కోట్లు వసూలుచేసిన ఖైదీ, వరల్డ్ వైడ్ గా 108 కోట్లు కలెక్ట్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని అల్లు అరవింద్, డైరెక్టర్ వి.వి.వినాయక్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చినందుకు ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా థాంక్స్ గివింగ్ మీట్ ని ప్లాన్ చేస్తుంది మెగా టీమ్. మ్యాగ్జిమం ఈ వీక్ లోనే ఆ మీటింగ్ కండక్ట్ చేసే చాన్సెస్ ఉన్నాయి. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ మిస్ అయిన చెర్రీ…  థాంక్స్ గివింగ్ మీట్ కి కంపల్సరీ గా అటెండ్ అవుతాడు.

మెగా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా డైరెక్టర్ వి.వి.వినాయక్ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని చిరుని ఫస్ట్ టైం సెట్స్ పై చూసినప్పుడే ఫిక్స్ అయ్యానని, చిరు తన 151 సినిమాలో ఇంకా యంగ్ లుక్ లో మెస్మరైజ్ చేస్తారని చెప్పాడు.

 

ఖైదీ నంబర్ 150 వారం రోజుల  వసూళ్లు

ఏపీ- తెలంగాణ –  రూ.76 కోట్ల 17 లక్షల 4 వేలు

కర్ణాటక – రూ. 9 కోట్లు

నార్త్ ఇండియా – రూ. కోటి 43 లక్షలు

నార్త్ అమెరికా – రూ. 17 కోట్ల 30 లక్షలు

రెస్ట్ ఆఫ్ ది వరల్డ్  (అమెరికా కాకుండా) – రూ. 3 కోట్ల 90 లక్షలు

ఒరిస్సా – రూ. 40 లక్షలు

తమిళనాడు – రూ. 60లక్షలు

టోటల్ – రూ. 108 కోట్ల 48 లక్షలు  (7 రోజుల్లో)