ఇద్దరూ రె'ఢీ'

Sunday,December 04,2016 - 12:20 by Z_CLU

నందమూరి బాలయ్య తన 100వ  సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ కు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశాడు. మరోవైపు మెగాస్టార్ చిరు కూడా తన 150 వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తి చేశాడు. ప్రస్తుతం బాలయ్య, చిరు  షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీ అయ్యారు. ఇద్దరూ ఈ  ప్రతిష్టాత్మక  సినిమాలతో సంక్రాంతి పోటీలో నిలిచారు. అయితే రిలీజ్ కి ఇంకా ఒక్క నెల మాత్రమే టైం ఉండడంతో  ప్రస్తుతం వీరిద్దరూ ప్రమోషన్ పై దృష్టి పెట్టారు.
collage4
చాలా ఏళ్ల తరువాత మెగా స్టార్, నటసింహం ఒకేసారి తమ సినిమాలతో పోటీ పడుతుండడం… అదీ సంక్రాంతి బరిలో కావడంతో  రెండు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ప్రమోషన్ విషయంలో కూడా వీరిద్దరూ ఓ రేంజ్ లో పోటీ పడబోతున్నారట. రెండు సినిమాల ఆడియో ను భారీ లెవెల్ లో  గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. మరి సంక్రాంతి పోటీకి రెడీ అవుతున్న ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేస్తారో? ఎలాంటి విజయాలు అందుకుంటారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే…