మెగా స్పీచ్ అదుర్స్

Sunday,January 08,2017 - 07:00 by Z_CLU

మెగా స్టార్ రి ఎంట్రీ ఇస్తున్న 150 వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’ కు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. హైలాండ్ లో జరిగిన ఈ మెగా ఈవెంట్ కి భారీ గా తరలి వచ్చారు మెగా ఫాన్స్. ఇక మెగా అభిమానులతో పాటు ఇండస్ట్రీ లో ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్ లో తన స్పీచ్ తో జోష్ నింపారు మెగా స్టార్. రి ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా కు బాస్ ఈజ్ బ్యాక్ అంటూ గ్రాండ్ వెల్కమ్ చెప్తుంటే సంతోషం ఉందని చెప్పిన మెగా స్టార్ అదే స్పీడ్ లో ఓ పవర్ డైలాగ్ తో మెగా ఫాన్స్ ను ఆనందం లో ముంచెత్తేసారు.

ఇంద్ర సినిమాలో డైలాగ్ ను తన వర్షన్ లో “రాననుకున్నారా, రాలేననుకున్నారా? ఢిల్లీకి పోయాడు డ్యాన్స్‌లకు దూరమైపోయాడు. హస్తినా పురానికి పోయాడు హస్యానికి దూరమైపోయాడు. ఈ మధ్య కాలంలో మన మధ్య లేదు, అందుకే మాస్‌కు దూరమైపోయాడని అనుకుంటున్నారేమో. అదే మాసు, అదే క్లాసు. అదే హోరు, అదే జోరు, అదే హుషారు.’అంటూ ఈవెంట్ లో తన స్పీచ్ తో హంగామా చేసాడు చిరు.