మెగాస్టార్ ఐటెం సాంగ్ ఎప్పుడు ? ఎక్కడ?

Thursday,September 08,2016 - 12:00 by Z_CLU

 దాదాపు ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత మెగాస్టార్ రీఎంట్రీ ఇస్తున్న 150 వ చిత్రం ‘ఖైదీ నెం 150’. వీవీ వినాయక్ దర్శకత్వం లో చిరు తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ ఐటెంసాంగ్ పెట్టాలని డిసైడ్ అయ్యారు. క్లయిమాక్స్ కు ముందు వచ్చే ఈ పాటకు సినిమాలో చాలా ప్రాధాన్యత వుంటుందట. ఈ స్పెషల్ సాంగ్ కోసం భారీ సెట్ కూడా సిద్ధం చేస్తున్నారు. తోట తరణి పర్యవేక్షణలో రామోజీ ఫిలింసిటీ లో ఈ భారీ సెట్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ నెలాఖరకు సిద్ధంకానున్న ఈ సెట్ కోసం కోటి నుండి కోటిన్నర వరకూ ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది. ఇక ఈ ఐటెంసాంగ్ లో చిరంజీవితో కలిసి చిందేసే భామను ఇప్పటికే సెలక్ట్ చేశారు. బన్నీ సరసన సరైనోడు, ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించిన క్యాథరీన్ ను, మెగాస్టార్ ఐటెంభామగా ఫిక్స్ చేశారు. వచ్చే నెల మొదటివారంలో ఈ స్పెషల్ సాంగ్ ను పిక్చరైజ్ చేయాలనుకుంటున్నారు. మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన ఈ ఐటెంసాంగ్ కు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.