డాన్సులతో అదరగొట్టబోతున్న మెగా స్టార్

Thursday,August 11,2016 - 04:14 by Z_CLU

మెగా స్టార్ తన 150 వ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రం ‘కత్తి’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా చిరు తనయుడు రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో చిరు తన దైన స్టైల్ డాన్సుల తో అదరగొట్టనున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమా కోసం రాఘవ లారెన్స్ తో పాటు ప్రభు దేవా ను కూడా సంప్రదించారు యూనిట్. చిరు ప్రతిష్టాత్మక 150 వ సినిమా కావడం తో బిజీ గా ఉన్నప్పటికీ చిరు కోసం ఈ చిత్రం లోని పాటలకు కొరియోగ్రఫీ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట ప్రభు దేవా, లారెన్డ్. మరి మెగా స్టార్ 150 సినిమాలో నటనతోనే కాదూ డాన్సులతో అదరగొట్టేయనున్నాడన్న మాట…