క్రొయేషియాలో ఖైదీ...

Friday,November 11,2016 - 08:00 by Z_CLU

మెగా స్టార్ ప్రస్తుతం ‘ఖైదీ నంబర్ 150’ సినిమాను జెట్ స్పీడ్ తో పూర్తి చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో ఈ సినిమాతో నిలవడం కోసం విపరీతంగా శ్రమిస్తున్నాడు చిరు. చిరు స్పీడ్ కు తగ్గట్టే.. ఓ వైపు షూటింగ్ తో పాటు మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.

   ఇటీవలే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా… ప్రస్తుతం యూరోప్ ల్యాండ్ అయింది. రెండు పాటల చిత్రీకరణ కోసం యూరప్ లోని స్లోవేనియా, క్రొయేషియా దేశాల్లో ఈ పాటలను తెరకెక్కించనున్నారు. దేవిశ్రీ అందించిన ఈ ట్యూన్స్ కి శ్రీమణి సాహిత్యం అందించారు. జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ ఈ పాటలకు కొరియోగ్రఫీ కంపోజ్ చేస్తున్నారు.