మెగా స్టార్ ముఖ్య అతిధి గా 'డి.ఎస్.పి. యు.ఎస్.ఎ. టూర్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్','జీ సినిమాలు లోగో ఆవిష్కరణ'.

Monday,August 08,2016 - 09:52 by Z_CLU

 

సంగీత సంచలనం దేవి శ్రీ ప్రసాద్…. విభిన్న సంగీతంతో వివిధ వేదికలపై విలక్షణమైన ప్రదర్శనలతో అమెరికాలో ‘డి.ఎస్.పి-యు.ఎస్.ఎ టూర్ వరల్డ్ ప్రీమియర్ ఈవెంట్’ పేరిట మెగా సందడి చేశారు. అమెరికాలోని న్యూ జెర్సీ, అట్లాంటా, శాన్ జోసే. షికాగో, డాలస్, వాషింగ్టన్ డి.సి నగరాల్లో భారతీయ ప్రదర్శనల్లో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఈ మెగా ఈవెంట్ ను తొలిసారిగా ‘డాల్బీ అట్మాస్’ సిస్టమ్ లో ఆగస్టు 6 వ తేదీన ప్రసాద్స్ ఐమాక్స్ లో గ్రాండ్ ప్రీమియర్ గా ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనకు మెగాస్టార్ చిరంజీవి , డాన్సింగ్ సెన్సేషన్ ప్రభు దేవా , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఇదే వేదిక పై మెగా స్టార్ చిరంజీవి ‘జీ సినిమాలు’ ఛానల్ లోగో ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విదేశాల్లో సంగీత ప్రదర్శన ఇచ్చి తన మ్యూజిక్ టాలెంట్ తో పాటు డాన్సింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన దేవిశ్రీను మెగాస్టార్ చిరంజీవి అభినందించారు.
అలాగే త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘జీ సినిమాలు’ ఛానల్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.

ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీమతి సురేఖ చిరంజీవి, దేవి శ్రీ ప్రసాద్ మాతృమూర్తి మీనాక్షి , అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్ ,దిల్ రాజు , భోగవల్లి ప్రసాద్ , జెమినీ కిరణ్ , స్రవంతి రవికిషోర్,బెక్కం వేణు గోపాల్, యువ కథానాయకులు నాగ చైతన్య, అఖిల్, సాయి ధరమ్ తేజ్,శ్రీనివాస్ బెల్లంకొండ, అల్లు శిరీష్,సుధీర్ బాబు, నిఖిల్, సుశాంత్, రాజ్ తరుణ్, విజయ్ దేవరకొండ, కథానాయికలు రకుల్ ప్రీత్ సింగ్,లావణ్య త్రిపాఠి, రీతూ వర్మ, హర్షిక, అనసూయ, రష్మీ, విద్యు లేఖ , దర్శకులు జయంత్ సి.పరాన్జీ, సుకుమార్, వంశీ పైడి పల్లి, మెహెర్ రమేష్, శ్రీవాస్, కళ్యాణ్ కృష్ణ, కిషోర్ తిరుమల, , త్రినాధ్ రావు నక్కిన తదితరులు హాజరై దేవిశ్రీ ను అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమం లో దేవి శ్రీ ప్రసాద్ సాంకేతిక బృందం కూడా పాల్గొన్నారు.